లేడీ సింగర్స్ పార్టిసిపేట్ చేసే షోస్ లో ఉండే జోష్ అండ్ ఫన్నీ స్టఫ్ మేల్ సింగర్స్ లో సహజంగా ఉండదు. కానీ ‘భీమ్లా నాయక్’ .జంట గాయకులు అరుణ్ కౌండిన్య, పృథ్వీ చంద్ర… ఆ అభిప్రాయం తప్పు అని నిరూపించారు. ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఫుల్ ఎనర్జీని నింపిపడేశారు. బాక్సాఫీస్ బరిలో గ్రాండ్ సక్సెస్ ను సొంతం చేసుకున్న ‘భీమ్లా నాయక్’ మూవీలోని టైటిల్ సాంగ్ ను పృథ్వీచంద్ర పాడితే, ‘లాలా… భీమ్లా’ పాటను అరుణ్ కౌండిన్య పాడాడు. వీరు పాడిన ఈ రెండు పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
విశేషం ఏమంటే.. అరుణ్, పృథ్వీని పరిచయం చేస్తూ సాకేత్ మంచి మాటలు చెప్పాడు. పృథ్వీ చంద్ర తనకు దేవుడిచ్చిన బావ అయితే… అరుణ్ కౌండిన్య బాల్య మిత్రుడిగా తన జీవితంలోకి అడుగుపెట్టిన బావ అని చెప్పాడు. తన పెద్దమ్మ కూతురు పూజను పృథ్వీ ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడని, దాంతో బావ అయిపోయాడని తెలిపాడు. ఇక అరుణ్ బీడీఎస్ చదివి డెంటిస్ట్ ప్రొఫెషన్ వదిలి సింగర్ గా కొనసాగుతున్నట్టు చెప్పాడు. అయితే తన జీవితం మాత్రం రామాచారి మాస్టర్ దగ్గర సింగర్ గానే మొదలైందని తెలిపాడు అరుణ్ కౌండిన్య. ముగ్గురు బైకర్స్ తనను ఛేజ్ చేసి మరీ సెల్ఫీ తీసుకున్న విషయం మర్చిపోలేనని అరుణ్ చెప్పగా, యుఎస్ఏలో పిల్లలు తనతో సెల్ఫీ దిగేవారని పృథ్వీ చెప్పాడు.
ఫోటోలు చూసి పాటలను గెస్ చేసే ఎపిసోడ్ లో పృథ్వీచంద్రది పైచేయి అయ్యింది. కేవలం సింగింగ్ కు పరిమితం కాకుండా ఇటీవల రైటింగ్ లోకి అడుగుపెట్టినట్టు పృథ్వీ చెప్పాడు. ఇదే సమయంలో సింగర్ దినకర్ కు ప్రాంక్ కాల్ చేసి ఉగాండాలో మ్యూజిక్ కన్సర్ట్ ఉందని రావాలని అరుణ్ సూపర్ ఫన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత తెలుగు పాటల ఇంగ్లీష్ ట్రాన్స్ లేషన్ ఎపిసోడ్ సూపర్ ఫన్నీగా సాగింది. అందులో ఒకరికి ఒకరు షకీలా తాగించుకుని ఎంజాయ్ చేశారు పధ్వీ అండ్ అరుణ్.
చిత్రం ఏమంటే… లేడీ సింగర్స్ కంటే మేల్ సింగర్స్ లోనే మైథాలజీకి సంబంధించిన నాలెడ్జ్ బాగా ఉందని ఈ ఎపిసోడ్ లో పృథ్వీ, అరుణ్ నిరూపించారు. పురాణాలకు సంబంధించిన ప్రశ్నలకు వీరిద్దరూ సరైన సమాధానాలు చెప్పారు. దీపిక పదుకునే తన సెలబ్రిటీ క్రష్ అని, సింగర్స్ లో శ్రేయాఘోషల్ అని చెప్పాడు పృధ్వీ. అలానే మనీషాతో పాడటాన్ని అవాయిడ్ చేస్తానని, సోనీతో అడ్జస్ట్ అవుతానని, రమ్యతో పాట పాడటాన్ని ప్రేమిస్తానని చెప్పాడు. తన సెలబ్రిటీ క్రష్ సమంత అని, లేడీ సింగర్స్ లో తన క్రష్ చిత్రమ్మ అని అరుణ్ తెలివిగా సమాధానం చెప్పాడు. సాహితీ చాగంటితో పాడాలంటే కొంత కష్టమేనని అందుకే ఆమెను అవాయిడ్ చేస్తానని, గీతామాధురితో అడ్జస్ట్ అవుతానని, మోహన భోగరాజుతో పాడటాన్ని లవ్ చేస్తానని తెలిపాడు. ఇక చివరగా ఈ ముగ్గురు కలిసి ‘భీమ్లా నాయక్’ లోని టైటిల్ సాంగ్ కు స్టెప్పులేసి… వ్యూవర్స్ ను ఆకట్టుకున్నారు. మొత్తంగా… ఫుల్ ఎనర్జీతో ఈ ఎపిసోడ్ సాగడం విశేషం.