Deepika Padukone : దీపిక పదుకొణె ఇప్పుడు రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. కానీ పెళ్లికి ముందే ఆమె చాలా మందితో డేటింగ్ చేసింది. ఈ విషయాన్ని ఆమె చెప్పకపోయినా.. చాలా సార్లు ఆమెతో డేట్ చేసిన వాళ్లే బయట పెట్టేశారు. ఇప్పుడు మరో నటుడు, మోడల్ ఇదే కామెంట్స్ చేశారు. ముంబైకి చెందిన నటుడు, మోడల్ ముజమ్మిల్ ఇబ్రహీం తాజాగా ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాడు. ఇందులో ఆయనకు దీపిక గురించి ప్రశ్న ఎదురవగా అసలు నిజాన్ని బయట పెట్టాడు.
Read Also : RGV : అమితాబ్ వల్లే చిరంజీవి, రజినీకి స్టార్ ఇమేజ్.. ఆర్జీవీ సంచలనం..
‘అవును నేను దీపికతో రెండేళ్లు డేటింగ్ చేశా. ఆమె ముంబైకి వచ్చినప్పుడు నాకే ముందు పరిచయం అయింది. 2002లో ఆమెతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరం డేటింగ్ చేశాం. దీపికనే నాకు ముందు ప్రపోజ్ చేసింది. ఆ తర్వాతనే నేను యాక్సెప్ట్ చేశా. ఆమెను వదులుకున్నందుకు నేను బాధపడట్లేదు. ఎందుకంటే ఆమె పెళ్లికి ముందు వరకు నాతో మాట్లాడింది. ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకునే వాళ్లం. పెళ్లి తర్వాత ఆమె నాతో టచ్ లో లేదు. కానీ ఆమె మంచి ట్యాలెంట్ ఉన్న యాక్టర్’ అంటూ చెప్పుకొచ్చాడు.
Read Also : Ritu Varma : సినిమా ప్లాప్ అయితే హీరో, హీరోయిన్లపై నిందలు.. రీతూవర్మ కామెంట్స్