Site icon NTV Telugu

MSVG: ప్రీమియర్స్’తో 1.2 మిలియన్..నిర్మాతకు కారు కొనివ్వనున్న అనిల్ రావిపూడి

Anil Ravipudi

Anil Ravipudi

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ అయిన తర్వాత, నిర్మాత సాహు గారపాటి అనిల్ రావిపూడికి అత్యంత విలువైన టయోటా వెల్‌ఫైర్ కార్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లోనే మరోసారి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా రూపొందింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా నటించిన సినిమాలో వెంకీ మామ మరో కీలక పాత్రలో నటించాడు.
ఇక ఈ సినిమా మొదటి ఆట నుంచే యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది.

Also Read: Akhanda 2 Vs MSVG: ‘అఖండ 2’ ఫుల్ రన్‌ ప్రీమియర్స్’తో కొట్టిన శంకర వరప్రసాద్ గారు!

అయితే, ఈ సినిమా హిట్ అయితే ఎలాంటి గిఫ్ట్ అనిల్ కి ఇవ్వబోతున్నారు అని యాంకర్ సుమ (లేదా యాంకర్) ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సాహు గారపాటిని ప్రశ్నించింది. దానికి సాహు గారపాటి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. అదేమిటంటే, ఈసారి ట్రెండ్ మార్చామని, ఈసారి అనిల్ తమకు కార్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడని బాంబు పేల్చారు.
వెంటనే అనిల్ రావిపూడి కల్పించుకుని, “నేను ఇస్తాననలేదు, వాళ్లే డిమాండ్ చేస్తున్నారు” అని అన్నారు. ఈ సినిమా అమెరికాలో ప్రీమియర్స్ కనుక వన్ మిలియన్ దాటితే కారు కొంటానని అన్నానని, అది జరగదులే అనుకుని అన్నాను కానీ ఇప్పుడు జరిగేలానే ఉందని కామెంట్ చేశారు. వాస్తవానికి ఈ ఇంటర్వ్యూ రిలీజ్ ముందు షూట్ చేసింది. రిలీజ్ అయ్యాక 1.2 మిలియన్లు ప్రీమియర్లు కలెక్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈ లెక్కన ఇప్పుడు అనిల్ రావిపూడి, సాహు గారపాటికి కొత్త కారు కొని ఇవ్వాల్సి వస్తుందన్నమాట. అయితే నిజంగానే కారు కొంటారా లేక లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి.

Exit mobile version