ఇండస్ట్రీలో ఎవ్వరి అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేము. అందులోను బుల్లి తెర నుండి వెండితేపరపై స్టార్ అవ్వడం అంత ఈజీ కాదు. అందులో మృణాల్ ఒకరు. హింది సిరియల్స్ ద్యారా తెరపై ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ సినిమాలో ఎంట్రీ ఇచ్చి .. తర్వాత టాలీవుడ్ లో ‘సీతరామం’ తో మరింత గుర్తింపు సంపాదించుకుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో శరీరాకృతి గురించి కామెంట్లు కొత్తేమీ కావు. కానీ, వాటికి జవాబు చెప్పడానికి మృణాల్ ఠాకూర్ తీసుకున్న స్టాండ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. “కర్వీ” అనిపించుకోవడం బలహీనత కాదని, అది ఒక అందమైన సహజ స్వరూపమని ఆమె చెబుతున్నారు.
Also Read : Rashmika Mandanna: నా ఎమెషన్స్‌ను దాచుకోడానికి కారణం ఇదే..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘కర్వీగా ఉండటం అంటే సోమరితనం కాదు, ప్రజలు ఈ తేడాను అర్థం చేసుకోవాలి. నేను ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తా, వ్యాయామానికి మద్దతు ఇస్తా. కానీ అదే సమయంలో, మనం మన చర్మం ఆరోగ్యంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. దాని కోసం సరైన నిద్ర.. మంచి ఫుడ్ కచ్చితంగా తీసుకుంటా. అలాగే కొన్ని పాత్రల కోసం బరువు పెరుగుతా, కొన్ని పాత్రల కోసం తగ్గుతా. ఇది నా పనిలో భాగం. ప్రతిసారీ ఈ మార్పులను ప్రజలకు వివరిస్తూ ఉండాల్సిన అవసరం లేదు. నా పాత్రలో నేను ఎలా నటిస్తున్నాననే విషయమే నాకు ముఖ్యం’ అని మృణాల్ స్పష్టం చేశారు. ఇవాల రేపు శరీర ఆకృతి కోసం కడుపు కట్టుకుంటున్న ఈ కాలంలో.. “రూపం కంటే ఆరోగ్యం, ఆనందం ముఖ్యం” అని చెబుతూ, ఇతరులకు ఆత్మవిశ్వాసం పెంచేలా మాట్లాడింది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ పరంగా చూస్తే, మృణాల్ ఠాకూర్ తదుపరి చిత్రం ‘డకోయిట్’ లో అడివి శేష్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.