NTV Telugu Site icon

Mrunal Thakur: సీతా.. లవ్ లో పడ్డావా.. ? అది కూడా అతనితో..

Seeta

Seeta

Mrunal Thakur: సీతారామం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ సినిమా.. ఆమె జీవితాన్నే మార్చేసింది. ప్రస్తుతం నాని సరసన హాయ్ నాన్న, విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాకుండా ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్‌ అయిన పిప్పా అనే హిందీ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్.. ప్రేమలో పడిందని వార్తలు గుప్పుమంటున్నాయి. రెండు రోజుల క్రితం బాలీవుడ్ భామ శిల్పాశెట్టి దివాళీ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసిన విషయం టెస్లిందే. ఇక ఈ సెలబ్రేషన్స్ లో మృణాల్.. బాలీవుడ్ ర్యాపర్‌ బాద్‌షాతో కలిసి జంటగా కనిపించింది. ఇక పార్టీ అంటే సెలబ్రిటీస్ కనిపించడం కామన్. కానీ, ఈ పార్టీలో మృణాల్, బాద్‌షా చేతులు పట్టుకొని రావడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా ఇద్దరు ఒకే కారులో రావడం, వెళ్లడం మరింత హీట్ రాజేసింది. దీంతో మృణాల్ లవ్ లో పడిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Breath Trailer: నందమూరి వారసుడు.. అదరగొట్టాడు

సాధారణంగా ఒక హీరోయిన్ రెండు సినిమాలు హిట్ కొట్టిందంటే చాలు.. రూమర్స్ వస్తూ ఉండడం చూస్తూనే ఉంటాం. మృణాల్ కు కూడా అంతే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక మృణాల్ ప్రస్తుతం కెరీర్ మీదనే ఫోకస్ చేస్తుందని కొంతమంది చెప్పుకొస్తున్నారు. ఈ వార్త విన్న అభిమానులు.. సీతా.. లవ్ లో పడ్డావా.. ? అది కూడా అతనితో.. నిజమేనా.. ? అని కామెంట్స్ పెడుతున్నారు. మొన్నటికి మొన్న అల్లు అరవింద్.. టాలీవుడ్ లోనే ఎవరో ఒక కుర్ర హీరోను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశీర్వదించాడు. అందుకు ఈచిన్నది అలాంటిందేమి లేదని వీడియో రిలీజ్ చేసి మరీ చెప్పుకొచ్చింది. మరి ఈ డేటింగ్ రూమర్స్ పై కూడా అమ్మడు స్పందిస్తుందేమో చూడాలి.

Show comments