Mr.Bachchan: ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందా.. అసలు నిజమేంటి?
- రవితేజ తాజా చిత్రం మిస్టర్ బచ్చన్
- ఆగస్టు 15నవరల్డ్ వైడ్ రిలీజ్
- ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ క్యాన్సిల్ అంటూ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ మాస్ మసాలా సినిమా. బాలీవుడ్ హిట్ సినిమా ‘రైడ్’ కి రీమేక్ గా వస్తోంది ఈ సినిమా. రవితేజ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే కథానాయకాగా నటిస్తోంది. ఇటీవల వవిడుదల చేసిన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా మిస్టర్ బచ్చన్ ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్ రెస్సాన్స్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో థియేట్రికల్ ట్రైలర్ ను బుధవారం విడుదల చేస్తామని మేకర్స్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. హైదరాబాద్ ట్రిపుల్(AAA ) సినిమాస్ లో సాయంత్రం 5 గంటలకి మిస్టర్ బచ్చన్ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని ప్లాన్ చేసారు నిర్మాతలు.
Also Read: Mega Year: 2024ను మెగా సంవత్సరంగా పిలుస్తున్న ఫ్యాన్స్. కారణం ఏంటంటే..?
Also Read
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
ఇందుకు సంబంధించి ఎంట్రీ పాస్ లను కూడా ఫ్యాన్స్ కు ఇచ్చేసారు. కానీ ఉన్నట్టుండి ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినట్టు ఈవెంట్ నిర్వాహకులు వెల్లడించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈవెంట్ ని నిలిపివేసామని, దయచేసి అభిమానులు అర్ధం చేసుకోగలరు అంటూ క్షమాపణలు కోరింది సదురు సంస్థ. సినిమాకు సంబంధించి రాబోయే అప్ డేట్స్ కోసం నిర్మణాసంస్థను ఫాలో అవండి అంటూ ఓ నోట్ రిలీజ్ చేసింది. అయితే నిజానికి ఈ ఈవెంట్ క్యాన్సిల్ చేయలేదు. ముందుగా నిర్వహించాల్సిన యూవీ మీడియా సంస్థ కాకుండా శ్రేయాస్ మీడియా సంస్థ నిర్వహిస్తోంది. సాయంత్రం 7 గంటల 11 నిమిషాలకి ట్రైలర్ రిలీజ్ కానుంది. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై TG. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు.
తాజావార్తలు
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..