‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ టీజర్ విడుదల చేసిన వినాయక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రమణ్ కథానాయకుడిగా కె. శిరీషా రమణారెడ్డి నిర్మిస్తున్నచిత్రం రెడ్డిగారింట్లో రౌడీయిజం. ఎం. రమేష్, గోపి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. వర్ష విశ్వనాథ్, ప్రియాంక, పావని, అంకిత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉందని, సినిమా పెద్ద హిట్ కావాలని అభిలషిస్తూ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు వినాయక్.
ఈ సందర్భంగా హీరో రమణ్ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, గోవా, రాయలసీమ ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేశాం. సినిమాలో ఐదు పాటలు, నాలుగు ఫైట్స్ ఉంటాయి. నలబై ఎనిమిది రోజుల్లోనే పక్కా ప్లానింగ్‌తో సినిమాను పూర్తి చేశాం. టైటిల్ చూసి ఇదేదో ఓ వర్గానికి సంబంధించిన సినిమా అనో, మరో వర్గాన్ని కించ పరిచే సినిమా అనో అనుకోకండి. సినిమా చూస్తే టైటిల్ ఎందుకు పెట్టామో అర్థమవుతుంది. హీరోగా నాకు మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది. సీనియర్ నటి వాణీ విశ్వనాథ్ సోదరి కుమార్తె వర్షా విశ్వనాథ్ మా సినిమాలో హీరోయిన్గా నటించారు. అలాగే సీనియర్ నటుడు వినోద్ కుమార్‌గారు విలన్‌గా చేశారు. నేను హీరోగా యాక్ట్ చేస్తున్న రెండో సినిమా పూర్తి కావచ్చింది. మరో రెండు సినిమాలు వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. అలాగే ఓ పాన్ ఇండియా మూవీని కూడా చర్చల దశలో ఉంది’’ అన్నారు.
Also Read
దర్శకులు ఎం. రమేష్, గోపి మాట్లాడుతూ ‘‘‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. ఎ.కె.ఆనంద్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. అలాగే మహిత్ నారాయణ్‌గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మా సినిమా తొలి పాటను వై.ఎస్. షర్మిల విడుదల చేశారు. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ రెండో పాటను విడుదల చేశారు. ఈ రెండు సాంగ్స్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు వినాయక్ గారు టీజర్ విడుదల చేసి సపోర్ట్ అందించారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని తెలియచేస్తాం” అని చెప్పారు.
తాజావార్తలు
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి