హాలీవుడ్ సినిమాల కోసం ఎదురు చూసినట్టు ఇప్పుడు వెబ్ సిరీస్ ల కోసం కూడా జనం కళ్లలో వత్తులు వేసుకుంటున్నారు. అటువంటి మచ్ అవెయిటెడ్ వెబ్ సిరీస్ ‘మనీ హెయిస్ట్’. ఇది ప్రపంచంలోనే అత్యంత సక్సెస్ ఫుల్ హెయిస్ట్ షో! అయితే, ‘మనీ హెయిస్ట్’ 5వ సీజన్ తో త్వరలోనే ముగియబోతోంది. అందుకే, పది ఎపిసోడ్ల చివరి సీజన్ ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు సిరీస్ మేకర్స్. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండనున్న ‘మనీ హెయిస్ట్’ సెప్టెంబర్ 3న వాల్యూమ్ వన్ రిలీజ్ అవుతుంది. ఇక రెండో వాల్యూమ్ లోనూ మొదటి దానిలాగే 5 ఎపిసోడ్స్ ఉంటాయి. అవి డిసెంబర్ 3న జనం ముందుకొస్తాయి. చివరి సీజన్ కాబట్టి ఎంతో జాగ్రత్తగా స్క్రిప్ట్ రాసి ఎగ్జిక్యూట్ చేశామంటున్నారు రైటర్స్, డైరెక్టర్. ఏదో మామూలు రాబరిగా మొదలైన ‘మనీ హెయిస్ట్’ సీజన్ వన్ ఇప్పుడు 5వ సీజన్ కల్లా పెద్ద సంగ్రామంలా మారింది! సిరీస్ ని ఫాలో అవుతోన్న యాక్షన్ లవ్వర్స్ కైతే సెప్టెంబర్ 3 కోసం ఎక్కడలేని ఉత్కంఠగా ఉంది! చూడాలి మరి, ‘మనీ హెయిస్ట్’ ఎలా ముగుస్తుందో…