ZEE5 తెలుగు గ్రామీణ తెలంగాణ ప్రాంతంలోని మూలాల్ని ప్రతిబింబించేలా ‘మోతెవరి లవ్ స్టోరీ’ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చింది. అనిల్ గీలా, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఆగస్టు 8న ప్రీమియర్ అయిన సంచలనాత్మక స్పందనను దక్కించుకుంది. శివ కృష్ణ బుర్రా రచన, దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మురళీధర్, సదన్న, విజయ లక్ష్మి, సుజాత ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, మై విలేజ్ షో బ్యానర్‌లపై మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ ‘మోతేవారి లవ్ స్టోరీ’ని నిర్మించిన సిరీస్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో మంగళవారం బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
War 2: వార్ 2 సినిమా చూడ్డానికి 10 రీజన్స్!
అనిల్ గీలా మాట్లాడుతూ .. ‘‘మోతెవరి లవ్ స్టోరీ’ని సపోర్ట్ చేస్తున్న ఆడియెన్స్ అందరికీ థాంక్స్. ఈ సిరీస్ చూస్తే మన ఇంట్లో జరిగే కథలానే అనిపిస్తుంది. మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ZEE5 టీంకు థాంక్స్. వీలైనంతగా మా సిరీస్‌ను అందరూ సపోర్ట్ చేయండి. మేం ఎంతో కష్టపడి ఇక్కడి వరకు వచ్చాం. ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపాం. మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది. మేం ఇలానే కష్టపడుతూనే ఉంటాం. ఇలానే ఆడియెన్స్ మా అందరినీ సపోర్ట్ చేయండి. మా సిరీస్ గురించి స్టాలిన్ చిత్రంలో చేప్పినట్టుగా ఓ ముగ్గురుకి చెబుతూ వెళ్లండి అని అన్నారు.