అఖిల్ అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా విడుదల తేదీ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 8 న వీరిద్దరి ఆన్ స్క్రీన్ ‘పెళ్లి’ తేదీ అని ఇంతకుముందు ప్రచారం జరిగింది. తాజాగా మేకర్స్ అదే డేట్ ను కన్ఫర్మ్ చేస్తూ ప్రకటించారు. ఈ చిత్రం అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల అవుతుందని మేకర్స్ ధృవీకరించారు. వచ్చే నెల నుంచి సినిమా ప్రమోషన్లను వేగవంతం చేయనున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జిఎ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో అఖిల్ హర్ష అనే ఎన్ఆర్ఐ పాత్రలో, పూజా హెగ్డే మాత్రం విభా అనే స్టాండర్డ్ కమెడియన్ పాత్రలో నటించబోతోంది. ఈషా రెబ్బ, మురళి శర్మ, వెన్నెల కిషోర్, జయప్రకాష్, ప్రగతి, ఆమని లాంటి నటీనటులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
Read Also : “పుష్ప”లో మరో టాలీవుడ్ విలన్
అక్టోబర్ 13న రావాల్సిన రాజమౌళి మల్టీ స్టారర్ “ఆర్ఆర్ఆర్” సినిమా వాయిదా అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మిగతా సినిమాలు అదే సమయంలో థియేటర్లలోకి రావడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. ఇప్పటికే సంక్రాంతి డేట్లపై పెద్ద హీరోలు ఖర్చీప్ వేసేసిన విషయం తెలిసిందే. అందుకే చాలా సినిమాలను దసరా బరిలో నిలపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్న శర్వానంద్, సిద్ధార్థ్ “మహాసముద్రం” సినిమా యూనిట్ అక్టోబర్ 14న సినిమాను విడుదల చేస్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే.