Mokshagna: నందమూరి కుటుంబం నుంచి ఎంతమంది వచ్చినా అందరి చూపు నట సింహం బాలయ్య వారసుడిపైనే ఉంది. ఎప్పుడో బాలయ్య.. మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెప్పాడు. కానీ, ఇప్పటివరకు అది జరిగింది లేదు. ప్రేక్షకులు చూసింది లేదు. అసలు మోక్షజ్ఞకు సినిమాలు మీద ఇంట్రెస్ట్ లేదు అనేది నందమూరి సన్నహితుల మాట. నందమూరి అండ పట్టుకొని పైకి వచ్చేయగల సత్తా ఉన్నా కూడా మోక్షజ్ఞ ఇంకా జంకుతున్నాడు అంటే.. అతనికి ఈ ఫీల్డ్ లోకి రావాలని లేదు అని అర్ధమవుతోంది. కానీ బాలయ్య నట వారసుడిగా రావడం మోక్షజ్ఞ కన్నా నందమూరి ఫ్యాన్స్ కోరుకొంటున్నారు. ఇక మోక్షజ్ఞ లుక్ మారుస్తున్నాడని, కథలు వింటున్నాడని ఏవేవో పుకార్లు వచ్చాయి. కానీ, అవి కూడా నిజం కాదని నేటితో తేలిపోయింది. నేడు మోక్షజ్ఞ పుట్టినరోజు.. ఈ వేడుకలను NBK 107 సెట్ లో నిర్వహించారు చిత్ర బృందం.
గోపీచంద్ మలినేని తో పాటు బాలయ్య, శృతి హాసన్, బాలయ్య భార్య వసుంధర తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక బాలయ్య, కొడుకు మోక్షజ్ఞకు కేక్ తినిపించి బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక ఈ ఫోటోలలో మోక్షజ్ఞ ఎప్పటిలానే ఉన్నాడు. పొట్ట ముందుకొచ్చి కనిపించాడు. ఒక హీరోగా ప్రయత్నించే కుర్రాడి లక్షణాలు ఒక్కటి కూడా కనిపించడం లేదు. దీంతో అభిమానులు నిరాశ చెందక తప్పడం లేదు.. ఏళ్లు గడుస్తున్నాయి కానీ మోక్షజ్ఞ ఎంట్రీ కి మాత్రం మోక్షం కనిపించడం లేదు. పోనీ.. సినిమాలు చేయను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినా ఆశలు పెట్టుకోకుండా ఉంటారుగా అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఏదిఏమైనా నందమూరి వారసుడే కాబట్టి నందమూరి ఫ్యాన్స్ ఈ ఫోటోలను వైరల్ గా మార్చేస్తున్నారు.
In the sets of #NBK107 😀
Happy Birthday #NandamuriMokshagna 🤗 pic.twitter.com/Fq36NUsudv
— Gopichandh Malineni (@megopichand) September 6, 2022