M4M: కిల్లర్ ఎవరో గెస్ చేస్తే ఒక్కోక్కరికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూవీ మేకర్ మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా, జో శర్మ హీరోయిన్గా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘ఎంఫోర్ఎం’ (M4M – Motive For Murder) విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల సినిమా హైలైట్స్ చెప్పారు. వరల్డ్‌వైడ్‌గా అందరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్టుతో తెరకెక్కించామని చెప్పారు. 110 ఏళ్ల సినీ చరిత్రలో ఇంతవరకు ఎవరూ తీసుకోని కాన్సెప్టుతో ఈ సినిమా చేసినట్టు తెలిపారు. రాబోయే పదేళ్లు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. ”ఇటీవల ‘ఎంఫోర్ఎం’ మూవీ హిందీ ట్రైలర్ ప్రతిష్టాత్మక గోవా ఫిలిం ఫెస్టివల్లో ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) ఆధ్వర్యంలో విడుదల చేయడంతో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిందని, అంచనాలు భారీగా పెరిగాయన్నారు. ఎక్సలెంట్ టీంతో సినిమాను ఎంతో అద్భుతంగా పూర్తి చేశామన్నారు. హీరోయిన్ జో శర్మ తన ఫర్మార్మెన్స్‌తో సినిమాకు హైలైట్‌గా మారిందని డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల తెలిపారు.
Cyclone Fengal: తీరాన్ని తాకిన ఫెంగల్ తుఫాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
Also Read
హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించామని, కథ, కథనాలను నమ్ముకునే సినిమాను తీశానని చెప్పారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల ఆసక్తికరమైన కాంపిటీషన్ ప్రకటించారు. విడుదలైన ఫస్ట్ డే ఈ సినిమా చూసి ఇందులో కిల్లర్ ఎవరో గెస్ చేస్తే ఒక్కోక్కరికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. హీరోయిన్ జో శర్మ మాట్లాడుతూ.. నేను ముందుగా బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మోహన్ వడ్లపట్ల గారికి. నాకు గాడ్‌ఫాదర్ ఆయన. నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం అమెరికా నుంచి హైదరాబాద్‌కు ఈ ఏడాదే ఆరు సార్లు వచ్చాను. నేను ఇందులో ఇన్విస్టిగేషన్ జర్నలిస్టుగా చేశాను. క్షణక్షణం ఉత్కంఠతో నడిచే ఈ సినిమా.. చూస్తున్నంత సేపు ఊపిరి బిగబెట్టేలా ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన వాళ్లందరి ఫీలింగ్ ఇదే. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకం ఉంది.
- Tags
- M4M Movie
- Mohan Vadlpatla
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..