Jailer: జైలర్ సినిమాలో మలయాళ, కన్నడ సూపర్ స్టార్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తలైవా రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. రజినీకాంత్ ‘ముత్తువేల్ పాండియన్’గా కనిపించనున్న జైలర్ సినిమాపై సౌత్ ఇండియాలో భారి అంచానలు ఉన్నాయి. ఆ అంచనాలు మరింత [పెంచుతూ దర్శకుడు నెల్సన్… జైలర్ సినిమా కోసం మలయాళ మరియు కన్నడ సూపర్ స్టార్ హీరోలని రంగంలోకి దించాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో, ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ షూటింగ్ లో పాల్గొన్నాడు. కన్నడలో టాప్ హీరోగా ఉన్న శివన్న, రజినీకాంత్ సినిమాలో స్పెషల్ రోల్ లో నటిస్తున్నాడు అనే వార్త బయటకి రాగానే కర్ణాటకాలోని సినీ అభిమానుల దృష్టి ‘జైలర్’ సినిమాపై పడింది. శివన్న షూటింగ్ పార్ట్ ని దాదాపు పూర్తి చేసిన నెల్సన్, ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పార్ట్ ని షూట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.
కంప్లీట్ యాక్టర్ గా, మలయాళ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న మోహన్ లాల్, రజినీకాంత్ తో కలిసి ‘జైలర్’ సినిమాలో కనిపించబోతున్నాడు. జనవరి 8, 9 తేదీల్లో మోహన్ లాల్-రజినీకాంత్ మధ్య సీన్స్ ని షూట్ చెయ్యడానికి చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మోహన్ లాల్ రావడంతో జైలర్ సినిమాలో ఇంటన్సిటీ పెరిగినట్లు అయ్యింది. కళ్ళతోనే యాక్టింగ్ చెయ్యగల శివన్న, రజినీకాంత్, మోహన్ లాల్ లని పెట్టి నెల్సన్ దిలీప్ కుమార్ ఎలాంటి సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సూపర్ స్టార్ హీరోల కాంబినేషన్ లో ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయి? అసలు అంత పెద్ద సూపర్ స్టార్స్ ని క్యామియో రోల్స్ కోసం ఎందుకు కాస్ట్ ఇన్ చేశారు? అనే విషయాలకి సమాధానం తెలియాలి అంటే ఏప్రిల్ 14న జైలర్ రిలీజ్ అయ్యే వరకూ వెయిట్ చెయ్యాల్సిందే. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న జైలర్ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?