Mohan Babu : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం కన్నప్ప సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వీఎఫ్ ఎక్స్ పనుల కారణంగా వాయిదా వేశారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అనేక విషయాలను పంచుకున్నారు. ‘నేను సినిమాల్లోకి వచ్చింది నటుడిగా నిరూపించుకునేందుకు. హీరోగానే చేయాలని నేను ఏ రోజు అనుకోలేదు. విలన్ గా ఎదగాలని ఆశపడ్డాను. నా గురువు దాసరి నారాయణరావు వల్లే హీరో అయ్యాను. అప్పట్లో సినిమాల్లో విలక్షణ నటుడిగా నేను పేరు తెచ్చుకున్నాను. అన్ని పాత్రలు చేశాను’ అన్నారు.
Read Also : Hrithik Roshan : నా ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్
‘సీనియర్ ఎన్టీఆర్ తో లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ మీద మేజర్ చంద్రకాంత్ సినిమా తీశాను. అంత రిస్క్ వద్దని ఎన్టీఆర్ గారు చెప్పినా వినలేదు. కానీ మంచి హిట్ కొట్టాను. ఇప్పుడు కన్నప్ప సినిమాను భారీ బడ్జెట్ తో తీశాను. శివుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీశానని అనిపిస్తోంది. ప్రస్తుతం చాలా మంది మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. కానీ నేను వాటిని పట్టించుకోను. ట్రోల్ చేసేవారిని విమర్శించను. ఎందుకంటే ఆ క్షణం వారికి అలా అనిపిస్తోంది. కానీ మనం ఎవరిని తిట్టినా తిరిగి అది మనకే చెందుతుంది అనేది గుర్తు పెట్టుకోవాలి. కన్నప్ప సినిమా తర్వాత ఏదైనా మంచి పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తాను. లేదంటే విద్యాలయాలు, పిల్లలను చూసుకుంటూ హాయిగా ఉండిపోతా’ అంటూ చెప్పుకొచ్చారు మోహన్ బాబు.