Mohan Babu Comments about Caste at Independence day Celebrations: 77వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తిరుపతిలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో మోహన్ బాబు పాల్గొన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఆయన. ఎందరో మహానుభావులు దేశం కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసి మనకు స్వాతంత్య్రం అందించారని, ఈరోజు మనం ఇలా జీవిస్తున్నామంటే వారి త్యాగాలే కారణం అని ఆయన అన్నారు. ఈ పండుగను పురస్కరించుకొని తిరుపతిలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించానని ఆయన వెల్లడించారు. నాకు జన్మనిచ్చిన జన్మభూమి మోదుగులపాలెం, ఒక నటుడిగా, ఒక నిర్మాతగా, రాజ్యసభ సభ్యుడిగా, విద్యాప్రదాతగా ఎదగడానికి నా తల్లిదండ్రులు, నా గ్రామ ప్రజలు మూలకారణం అని మోహన్ బాబు అన్నారు.
Bhagavanth Kesari: అన్న హరికృష్ణ సినిమానే బాలయ్య రీమేక్ చేస్తున్నాడా?
పల్లెటూరు నుంచి ఢిల్లీ పార్లమెంట్ వరకు ప్రస్థానం సాగడానికి నాకు జన్మనిచ్చిన నా పల్లెటూరే కారణం అని పేర్కొన్న ఆయన అంత గొప్పగా ఎదగడానికి మూలమైన నా తల్లిదండ్రులను, జన్మభూమిని, ఆప్తులు, ఆత్మీయులైన మా గ్రామస్తులను ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటానని అన్నారు. నా జన్మభూమిని ఎప్పుడూ మనసులో స్మరిస్తూ ఉండాలనే ఉద్దేశ్యంతో ఒక ప్రణాళికను రూపొందించుకున్నానని, నేను స్థాపించిన విశ్వ విద్యాలయంలో మొక్కలు నాటాలనుకున్నానని, దీనికి నా జన్మభూమి అయిన మోదుగులపాలెం నుంచి 100 మంది మా గ్రామస్తులను అక్కడ ప్రవహించే స్వర్ణముఖి నది ఇసుకను ఒక గుప్పెడు, వారి పొలంలోని మట్టిని గుప్పెడు తెమ్మన్నానని అన్నారు.
దానితో పవిత్రమైన ఈరోజు ఇక్కడ మొక్కలు నాటుతున్నానని, ఈ మాటలు చెప్పగానే మాగ్రామస్తులు ఎంతో ఉప్పొంగిపోయారు. రెండు బస్సులలో వారిని ఇక్కడికి పిలిపించానని ఆయన అన్నారు. గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటిన మంచు మోహన్ బాబు, మంచు విఘ్ణ ఆ తరువాత భక్తి పాటలతో మైమరచిపోయారు. ఇక చిన్నప్పటి నుంచి కులాలంటే నాకు అసహ్యం అని పేర్కొన్న మోహన్ బాబు అసలు కులాలను ఎవరు కనిపెట్టారు? అని ప్రశ్నించారు. 8వ తరగతి చదువుతుండగా నాతోటి వాడిని అంటరానివాడంటే చెప్పు తీసుకుని కొడుతానన్నానని పేర్కొన్న ఆయన గ్రామంలో మామా, అల్లుడు అంటూ అందరూ కలిసి మెలిసి ఉండేవాళ్ళమని అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు,నువ్వు ఆ కులం, నువ్వు ఈ కులం అంటున్నారని ఇది మరీ ఎక్కువ అయింది… సర్వనాశనికి దారి తీస్తుందని అన్నారు.