Mohan Babu: మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జిన్నా. మోహన్ బాబు, కోన వెంకట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబర్ 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన చిత్ర బృందం నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ వేడుకకు మోహన్ బాబు గెస్టుగా హాజరయ్యారు.
ఇక మంచు విష్ణు కుటుంబం మొత్తం హాజరు అయ్యింది. మోహన్ బాబు కు మనవరాళ్లు, మనవడు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ స్టేజిపై మంచు విష్ణు కొడుకు అవ్ రామ్ తో కలిసి మోహన్ బాబు చిందులు వేశారు. జానపద పాటకు మనవడితో కలిసి స్టెప్పులు వేశాడు. మధ్యలో ఆలీ కూడా బుడ్డోడితో చిందులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఫ్యామిలీ ఫంక్షన్ పెట్టుకున్నారా..? ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకున్నారా..? అని కొందరు.. మీ సొంత డబ్బా కొట్టుకోవడం ఆపరా.. ఇక అని మరికొందరు అంటుండగా.. ఇంకొందరు క్యూట్ వీడియో అని ప్రశంసిస్తున్నారు.