Keeravani : రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ హీరోగా వస్తున్న ఎస్ ఎస్ఎంబీ-29 సినిమాపై అందరి చూపు ఉంది. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్ డేట్ లేదా కామెంట్ వినిపించినా సరే సినీ ప్రపంచం మొత్తం అటువైపే చూస్తోంది. ఇక తాజాగా కీరవాణి చేసిన కామెంట్స్ సినిమాపై హైప్స్ విపరీతంగా పెంచేస్తున్నాయి. ఇప్పటికే లీకుల పేరిట ఏదో ఒక ఫొటో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఇలాంటి టైమ్ లో కీరవాణి సినిమా గురించి ఎవరూ చెప్పని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. కీరవాణి రేపు ‘నా టూర్ ఎంఎం కే’ అనే ఈవెంట్ ను మార్చి 22న నిర్వహించబోతున్నారు.
Read Also : Deputy CM Pawan Kalyan: రేపు కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన..
ఈ ప్రోగ్రామ్ ప్రమోషన్లలో ఆయన మాట్లాడుతూ.. ‘ ఎస్ ఎస్ ఎంబీ లాంటి సినిమా ఇప్పటి వరకు ఎన్నడూ రాలేదు. ఇది చాలా కఠినమైన ప్రాజెక్ట్. ఇప్పటి వరకు నేను ఎన్నో సినిమాలు చేశాను. కానీ దీనికి పనిచేయడం సవాల్ గా ఉంది. ప్రతి సినిమా ఒక సవాల్. కొత్త సౌండ్స్ ను క్రియేట్ చేయాలి. కానీ ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు కాబట్టే కష్టంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఇంకేముంది ఆ కామెంట్లు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇప్పటి వరకు అలాంటి సినిమా రాలేదంటే.. అది ఏ రేంజ్ ఉంటుందో అని అప్పుడే ఫ్యాన్స్ తెగ ఊహించేసుకుంటున్నారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్ననే ఒడిశా షెడ్యూల్ ను మూవీ టీమ్ కంప్లీట్ చేసుకుంది.