Miss Shetty Mr Polishetty wrong timing for release: సెప్టెంబర్ 7వ తేదీన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా నటించిన జవాన్ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవ్వగా నవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్గా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. జవాన్ సినిమా పూర్తిస్థాయి మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ కాగా మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి మాత్రం సైలెంట్ కామెడీ సినిమా అని అంటున్నారు. అయితే జవాన్ సినిమా అన్ని సెంటర్ల ప్రేక్షకులను అలరిస్తోంది అని చెప్పక తప్పదు. ముఖ్యంగా బీ,సీ సెంటర్లు ఆడియన్స్ ఈ సినిమాకి ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులు అయితే ఇలాంటి సినిమా దాదాపు 30-40 ఏళ్లలో రాలేదేమో అన్నంతగా చొక్కాలు చింపేసుకుంటున్నారు. అక్కడి క్రిటిక్స్ సైతం నాలుగు నాలుగున్నర రేటింగ్స్ ఇస్తున్నారు.
Jaffer Sadiq: నక్క తోక తొక్కాడురా.. జవాన్ లోనూ కూడా జాఫర్ సాధిక్ రచ్చ
అదే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విషయానికి వస్తే మాత్రం ఏ సెంటర్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. బీ,సీ సెంటర్ల ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయితే ఈ సినిమా మరో జాతి రత్నాలు అవడం ఖాయమే. అయితే జవాన్ తో పోటీపడి బీ,సీ సెంటర్ల ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం అంటే ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదనే చెప్పాలి. ఒకరకంగా సినిమా రిలీజ్ డేట్ కోసం ఇన్నాళ్లు ఆగిన సినిమా యూనిట్ మరొక వారం రోజులు ఆగి ఉంటే సెప్టెంబర్ 15వ తేదీ లభించేది. అయితే సలార్ దెబ్బకి అన్ని సినిమాలు రిలీజ్ డేట్లు మార్చుకోవడంతో సెప్టెంబర్ 15వ తేదీకి ఇప్పుడు చంద్రముఖి 2 మాత్రమే ఉంది. ఒకవేళ ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయకుండా ఒక వారం వాయిదా వేసి 15వ తేదీ రిలీజ్ చేసి ఉంటే కలెక్షన్స్ లో కచ్చితంగా తేడా ఉండి ఉండేది. జవాన్ తో పోటీగా దిగడంతో ఇప్పుడు ఎంతవరకు సినిమాకి వర్కౌట్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది.