మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్ కమింగ్ మూవీ ‘మిరాయ్’. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు, రితికా నాయక్, శ్రీయా శరణ్, జగపతిబాబు, జయరాం వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గౌరహరి సంగీతం అందించగా, పీపుల్ మీడియా సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఫాంటసీ, యాక్షన్, పురాణాత్మక అంశాలతో కూడిన ఈ భారీ సినిమా 2025 సెప్టెంబరు 12న థియేటర్లలో విడుదల కానుంది. కర్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, విజువల్ వండర్ గా రూపొందిన మిరాయ్, అద్భుతంగా ఉండబోతోందని టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.
Also Read : Lokah Chapter 1: ‘లోక’ పై బాలీవుడ్ టాప్ హీరోయిన్ల రివ్యూలు..
ఇప్పటికే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోగా.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుండి U/A 16+ సర్టిఫికేట్ పొందింది. కాగా ఈ సినిమాకి మొత్తం రన్ టైమ్ 169 నిమిషాలు (అంటే 2 గంటలు 49 నిమిషాలు) గా ఫైనల్ చేశారు. ఇక ప్రేక్షకులు రెండు గంటలకు పైగా ఒక అద్భుతమైన విజువల్ జర్నీకి సిద్ధంగా ఉండాల్సిందే. ఇక తాజాగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మిరాయ్’ రిలీజ్కు కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అంటూ.. మూవీలో జగపతిబాబు అద్భుతమైన ‘అంగమ బలి’ పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. చీకటి శక్తులపై వెలుగు విజయాన్ని సాధించే ఈ కథలో, ఆయన తంత్ర రక్షకుడిగా తెరపై కనబడుతుండటం ఇప్పటికే సినిమా హైలైట్గా మారింది. కాగా ఈ పోస్ట్ లో జగపతి బాబు లుక్ చాలా అద్భుతంగా ఉంది.
From the Darkest Forces, Rises a Beacon of Light ✨
Experience 'Angama Bali' aka #JagapathiBabu's astounding presence as the protector of Tantra on the big screens 💥
6 DAYS TO GO 🔥#MIRAI GRAND RELEASE WORLDWIDE ON 12th SEPTEMBER🥷
Superhero @tejasajja123
Rocking Star… pic.twitter.com/I3kHJACSzz— People Media Factory (@peoplemediafcy) September 6, 2025