వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న సినిమా ‘హరికథ’. ఈ అట్రాక్టివ్ టైటిల్ తో కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిలరామ్, లావణ్యరెడ్డి, కీర్తి ప్రధాన తారాగణంగా అనుదీప్ రెడ్డి మూవీని తెరకెక్కిస్తున్నారు. దీన్ని ఐరావత సినీ కలర్స్ బ్యానర్ పై రంజిత్ కుమార్ గౌడ్, వివేకానంద, రఘు, కవిత నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా, సర్వహంగులతో రూపొందుతున్న ‘హరికథ’ మూవీ టైటిల్ యానిమేషన్ లాంచ్, పోస్టర్ లాంచ్ ఇటీవల తెలంగాణ క్రీడలు, యువజన, పర్యాటక మరియు ఆబ్కారీ శాఖామాత్యులు శ్రీనివాస్ గౌడ్, మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది.
ఈ కార్యక్రమంలో దర్శకులు అనుదీప్ రెడ్డి సహా నటీనటులు, డీఓపీ ఎస్.కె. మస్తాన్, షరీఫ్, సంగీత దర్శకుడు మహావీర్, ఎడిటర్ బొంతల నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తానికి శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘హరికథ’ సినిమా వినూత్నమైన కాన్సెప్ట్ తో రూపుదిద్దుకుంటోందని, అన్ని వర్గాలకు నచ్చే కుటుంబ, ప్రేమ కథా చిత్రమిద’ని దర్శకుడు అనుదీప్ రెడ్డి చెప్పారు. ‘ఎక్కడా రాజీ పడకుండా అందరికీ నచ్చేలా దీనిని నిర్మించామని, అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామ’ని నిర్మాతలు అన్నారు.