లేడీ సూపర్ స్టార్ నయనతార ఎట్టకేలకు తన ప్రియుడు విగ్నేష్ శివన్ ను వివాహమాడిన విషయం విదితమే. ఎంతోకాలంగా ప్రేమలో మునిగిన తేలుతున్న ఈ జంట మహాబలిపురంలోని ఒక రిసార్ట్ లో అత్యంత సన్నిహితుల మధ్య ఒక్కటి అయ్యారు. ఉదయం నుంచి వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తన పెళ్లి ఫోటోలను షేర్ చేసిన విగ్నేష్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
“నయన్, నేను ఒక్కటయ్యాం.. భగవంతుడి ఆశీస్సులు, తల్లిదండ్రులు, స్నేహితులు, అందరి ఆశీస్సులతో మా పెళ్లి జరిగింది’ అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు చిలకా గోరింకల్లా ఉన్నారు, నిండునూరేళ్లు కలిసి జీవించండి అని ఆశీస్సులు అందిస్తున్నారు. అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తాజాగా ఏపీ మంత్రి రోజా సెల్వమణి నయన్ జంటకు శుభాకాంక్షలుతెలపడం విశేషం.. ఆమె ట్వీట్ చేస్తూ “నయనతార-విఘ్నేష్ వైవాహిక జీవితం నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
నయనతార-విఘ్నేష్ వైవాహిక జీవితం నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ…
Happy married life to both of you.
Stay blessed ♥️♥️ @VigneshShivN #nayanthara pic.twitter.com/whSqyCpvRV— Roja Selvamani (@RojaSelvamaniRK) June 9, 2022