లేడీ సూపర్ స్టార్ నయనతార ఎట్టకేలకు తన ప్రియుడు విగ్నేష్ శివన్ ను వివాహమాడిన విషయం విదితమే. ఎంతోకాలంగా ప్రేమలో మునిగిన తేలుతున్న ఈ జంట మహాబలిపురంలోని ఒక రిసార్ట్ లో అత్యంత సన్నిహితుల మధ్య ఒక్కటి అయ్యారు. ఉదయం నుంచి వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తన పెళ్లి ఫోటోలను షేర్ చేసిన విగ్నేష్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. “నయన్, నేను ఒక్కటయ్యాం.. భగవంతుడి ఆశీస్సులు, తల్లిదండ్రులు, స్నేహితులు,…