శివ కందుకూరి, రాశిసింగ్ జంటగా నటించిన 'భూతద్దం భాస్కర్ నారాయణ' విడుదల వాయిదా పడింది. సి.జి. వర్క్ పూర్తి కాగానే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు.
శివ కందుకూరి నటించిన 'భూతద్దం భాస్కర్ నారాయణ' చిత్రంలోని ఫస్ట్ సింగిల్ విడుదలైంది. విజయ్ బుల్గానిన్ స్వర రచన చేసిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి గానం చేశాడు.