కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం కుబేర. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఏషియన్ సినిమాస్ సునీల్, రామ్ మోహన్ రావ్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 20న వరల్డ్ వైడ్ గా రిలీజ్ థియేటర్లలో రిలీజ్ అయింది.
Also Read : Suriya 45 : సూర్య ‘కరుప్పు’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
తొలి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు కాస్త స్లో గా స్టార్ట్ అయిన కుబేర మౌత్ టాక్ తో జెట్ స్పీడ్ అందుకుంది. ధనుష్ చేసిన రెండవ స్ట్రయిట్ సినిమా కూడా సూపర్ హిట్ అనే టాక్ తో దూసుకెళ్తోంది. ఇదిలా ఉండగా కుబేర బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఆ సంతోషాన్ని సెలెబ్రట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. అందుకోసం నేడు కుబేర సక్సెస్ మీట్ ను నిర్వహించబోతున్నారు. ఈ వేడుకలు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. మంచి సినిమాలను ఎప్పుడు ఎంకరేజ్ చేసే చిరు ఇప్పుడు కుబేర కోసం వస్తున్నారట. సాయంత్రం జరగబోయే ఈ వేడుకను టాలీవుడ్ లోని ప్రముఖుల సమక్షంలో మాత్రేమే నిర్వహించనున్నారని సమాచారం. అటు అక్కినేని ఫ్యాన్స్ ను కానీ ఇటు ధనుష్ ఫ్యాన్స్ కు ఎవరిని అనుమతించడం లేదని సమాచారం. కాగా కుబేర తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కంటే రెండవ రోజు అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. నేడు వీకెండ్ కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తోంది కుబేర.