సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ స్పెషల్ గా ట్వీట్ చేశారు. “సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. అతడికి మీ అందరి ఆశీస్సులు రిపబ్లిక్ చిత్ర విజయం రూపంలో అంతా అని ఆశిస్తూ, ఆ చిత్రం యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు. అలాగే కరోనా సెకండ్ వేవ్ బారినపడి కుదేలైన సినిమా ఎగ్జిబిషన్ సెక్టార్ కి రిపబ్లిక్ చిత్ర విజయం కూడా కోలుకోవడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తుంది అని ఆశిస్తున్నాను” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
Read Also : ‘రిపబ్లిక్’లో ఆ షాట్ చూస్తే షాక్ అవుతారు!
దేవకట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రీమియర్ షో లను ముందు రోజు రాత్రి ప్రదర్శించగా, సినిమాకు మంచి స్పందన వచ్చింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కూడా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. సెప్టెంబర్ 9న సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే
Best Of Luck Team #Republic @IamSaiDharamTej pic.twitter.com/hyZJYy9AfI
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 30, 2021