‘రిపబ్లిక్’లో ఆ షాట్ చూస్తే షాక్ అవుతారు!

సుప్రీమ్ హీరో సాయితేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ అతను కోరుకున్నట్టుగా అక్టోబర్ 1న జనం ముందుకు వచ్చింది. ముందు రోజు రాత్రే టాలీవుడ్ ఫిల్మ్ పర్సనాలిటీస్ కోసం ప్రీమియర్ షోను వేశారు. సినిమా చూసిన వాళ్ళంతా సాయి తేజ్ నటనను, కథను తెరకెక్కించడంలో దర్శకుడు దేవ్ కట్టా చూపించిన నిజాయితీని అభినందిస్తున్నారు. ఇటీవలే కోమా లోంచి బయటకు వచ్చిన సాయి తేజ్, ఈ విజయాన్ని మనసారా ఆస్వాదించాలని అందరూ కోరుకుంటూ, శుభాకాంక్షలు తెలుపుతూ, సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

అయితే… ‘రిపబ్లిక్’ సినిమా చూసిన వాళ్ళు మూవీలోని ఓ షాట్ ను చూసి… షాక్ అవుతున్నారట. కథానుగుణంగా హీరో పంజా అభిరామ్ (సాయితేజ్) మోటర్ బైక్ మీద వెళుతుంటే… స్కిడ్ అయ్యి కిందపడతాడు. కొద్ది పాటి గాయాలు అవుతాయి. హాస్పిటల్ లో చేరతాడు. ఈ షాట్ చూడగానే… ఆ తర్వాత కొద్ది రోజులకే అతను నిజ జీవితంలోనూ ఇలానే కింద పడిన విషయం, ప్రాణాపాయ పరిస్థితిలో హాస్పటిల్ లో చేరి బయటపడిన విషయాన్ని తలుచు కుంటున్నారు. దేవ్ కట్టా మనసుకు అసలు ఇలాంటి షాట్ ఒకటి చిత్రీకరించాలని ఎలా అనిపించింది? అనుకుంటున్నారు. ఏదేమైనా సినిమాలో చిన్నపాటి దెబ్బలతో హీరో బయట పడ్డాడు కానీ రియల్ లైఫ్ లో మాత్రం సాయి తేజ్ చావు అంచులవరకూ వెళ్ళి వెనక్కి వచ్చాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. బాధాకరం ఏమంటే… తన సినిమా విడుదల సమయంలో అతను ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయాడు. అదే రకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూ హాజరు కాలేకపోయాడు. అయినా డాక్టర్ల కృషి, తన విల్ పవర్ తో తిరిగి మామూలు మనిషి అవుతున్నాడు. ఇక మూవీ క్లయిమాక్స్ లోని సీన్ చాలా మందికి కంట తడిపెట్టిస్తోందని టాక్! మరి ఈ థాట్ ప్రొవోకింగ్ మూవీని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి!

-Advertisement-'రిపబ్లిక్'లో ఆ షాట్ చూస్తే షాక్ అవుతారు!

Related Articles

Latest Articles