మెగాస్టార్ మెగా ఫోన్ పడితే ఎలా ఉంటుంది? అసలు ఆయనకు డైరెక్షన్ పై ఇంట్రెస్ట్ ఉందా ? అంటే సమాధానం ‘యస్’ అనే సమాధానం విన్పిస్తోంది మన ‘ఆచార్య’ నుంచి ! ఈరోజు కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా యంగ్ డైరెక్టర్స్ తో కలిసి చిరంజీవి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇందులో భాగంగానే చిరంజీవి దర్శకత్వం వైపు ఎప్పుడు వెళ్ళబోతున్నారు ? అనే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వెల్లడించారు.
Read Also : Acharya : చిరంజీవి అనే పేరు ఎలా వచ్చిందంటే?
చిరంజీవి మాట్లాడుతూ “ఇన్నేళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్నా… కాబట్టి ఏ శాఖ పనితనం ఏంటి ? కెమెరా, మ్యూజిక్, ఆర్ట్ వంటి విషయాలపై పూర్తి అవగాహన ఉన్న నాకు దర్శకత్వం అనేది పెద్ద కష్టంగా అనిపించదు. ఒకవేళ మంచి కంటెంట్ ఉంటే దర్శకత్వం చాలా ఈజీ. ఆ కంటెంట్ ను చక్కగా వండితే, వడ్డించడం ఎవరైనా చేస్తారు. అంటే నా ఉద్దేశంలో లెన్సులు మార్చి, ట్రాలీలు వేయడం, డ్రోన్లతో తీయడం వంటివి కాదు… దర్శకత్వం అంటే కథ, కథనం, కథా గమనం… ఇది ఇంట్రెస్టింగ్ గా చేస్తే సినిమా హిట్టా కాదా అనేది అక్కడే తేలిపోతుంది. అవకాశం వస్తే డైరెక్షన్ చేయాలని ఆశగా ఉంది. కానీ వరుసగా సినిమాలు రావడం వల్ల దర్శకత్వం కుదరడం లేదు. కానీ 70 ఏళ్ళు వచ్చాక డైరెక్టర్ గా మీకు టఫ్ కాంపిటీషన్ ఇస్తాను” అంటూ డైరెక్షన్ లోకి ఎప్పుడు అడుగు పెట్టబోతున్నారు అనే విషయాన్ని కూడా వెల్లడించారు.