ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మెగాభిమానులకు పండగ రోజైన ఆ రోజున చిరు సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ఖుషీ అవబోతున్నారు. చిరు ‘ఆచార్య’గా నటిస్తున్న సినిమాతో చివరి దశలో ఉంది. ఇక చిరు 153 ఇటీవల సెట్స్‌పైకి వచ్చింది. ఈ రెండింటితో పాటు, దర్శకులు బాబీ, మెహర్ రమేష్‌తో చిరంజీవి మరో రెండు సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. ఈ నాలుగు సినిమాల అప్ డేట్స్ ఆగస్ట్ 22 న అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.
Read Also : “రాజ రాజ చోర” ట్విట్టర్ రివ్యూ
ఇదిలా ఉంటే మరో దర్శకుడు చిరంజీవిని కథతో ఆకట్టుకున్నాడట. అయన ఎవరో కాదు దర్శకుడు మారుతి. మెగా కుటుంబానికి దగ్గరగా మెలిగే మారుతికి చిరంజీవితో సినిమా చేయాలన్నది ఎప్పటినుంచో కల. ఇటీవల చిరంజీవిని కలిసిన మారుతి ఓ లైన్ చెప్పాడట. మారుతి చెప్పిన లైన్ కొత్తగా ఉండటంతో చిరంజీవి పూర్తి స్థాయి స్క్రిప్ల్ ను రెడీ చేసి కలవమని చెప్పాడట. అదే నిజమైతే మారుతికి ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు బడా హీరోలలో ఒక్క వెంకటేశ్ తో ‘బాబు బంగారం’ అనే సినిమా చేశాడు మారుతి. అయితే ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడు చిరంజీవి సినిమాతో దక్కిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాడట మారుతి. ఈ ప్రాజెక్ట్ ను కొణిదెల ప్రొడక్షన్ తో కలసి యువి క్రియేషన్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.