యంగ్ హీరో అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 3 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాకు ఫిదా అయ్యారు అంటే అతిశయోక్తి కాదు.. నిన్నటికి నిన్న ఈ సినిమాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రశంసలు వర్షం కురిపించిన విషయం విదితమే.. ఇక తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతిలో పొగడ్తలు కురిపించారు . ఇటీవలే సినిమా చూసిన చిరు.. తాజాగా మేజర్ టీమ్ ను పర్సనల్ గా కలిసి వారిని అభినందించారు. వారితో లంచ్ చేసి మరీ వారి కష్టాన్ని మెచ్చుకున్నారు.
ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరు ట్విట్టర్ లో షేర్ చేస్తూ “మేజర్ ఒక సినిమా కాదు.. ఒక ఎమోషన్.. ఒక రియల్ హీరో, అమర వీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఎంతో అద్భుతంగా చూపించారు.. తప్పకుండ చూడాల్సిన సినిమా.. ఇలాంటి ఒక ప్రయోజనాత్మకమైన సినిమాను మహేష్ బాబు నిర్మించినందుకు గర్వంగా ఉంది. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు” అని ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ పై మహేష్ స్పందిస్తూ చిరుకు థాంక్స్ చెప్పారు. ” థాంక్యూ చిరంజీవి సర్.. మేజర్ చిత్రబృందం ఆనందానికి అవధులు లేకుండా పోయింది” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Thank you @KChiruTweets sir! 🙏 Team #Major is over the moon!! 🤗🤗🤗 https://t.co/KVCYvkRTDP
— Mahesh Babu (@urstrulyMahesh) June 13, 2022