ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఇండియాలోనే కాదు బియాండ్ ది బౌండరీస్ కూడా రామ్ చరణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేస్ లో ఉంది కాబట్టి ఎక్కడ చూసినా ఆ టాపిక్ ఏ నడుస్తుంది. సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎదో ఒక విషయంలో చరణ్ పేరు ట్రెండ్ అవుతూనే ఉంది. ప్రస్తుతం చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో RC 15 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఒక సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై మెగా అభిమానుల్లోనే కాదు రెగ్యులర్ మూవీ లవర్స్ లో కూడా భారి అంచనాలు ఉన్నాయి. చరణ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శంకర్ స్టైల్ లో ఉండే సోషల్ మెసేజ్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ RC15లో ఉంటాయని సమాచారం.
ఇటివలే జరిగిన RC 15 షెడ్యూల్ నుంచి చరణ్ కి సంబంధించిన ఫోటోస్ కొన్ని లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిలో చరణ్ విలేజ్ లుక్ లో, CM క్యాండిడేట్ గా కనిపించి, తన పార్టీకి ప్రచారం చేస్తున్నాడు. కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకోని వెళ్లిన శంకర్, RC 15 మరియు భారతీయుడు 2 సినిమాలని బ్యాక్ టు బ్యాక్ షూట్ చేస్తున్నాడు. ఈ కారణంగా RC 15 సినిమా ఒక నెలలో 12 రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుంటుంది. ఇందుకే RC 15 సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎవరికీ ఎలాంటి క్లారిటీ రావట్లేదు. నిజానికి ఈ మూవీ ఈ ఇయర్ ఎండ్ వరకూ కంప్లీట్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. దాదాపు 2024 సంక్రాంతికే RC15 ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. దిల్ రాజుకి సంక్రాంతి సీజన్ లో తన సినిమాని రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్స్ రాబడుతుందనే విషయం చాలా బాగా తెలుసు అందుకే RC 15 సినిమాని దాదాపు సంక్రాంతికే రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే RC 15 సినిమా సంక్రాంతికి రిలీజ్ కావడం అల్లు అర్జున్ ని కష్టాలలోకి నెట్టే విషయమే.
అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప ది రూల్ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీని కూడా వచ్చే సంక్రాంతికే రిలీజ్ చెయ్యాలని ,మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఓన్ రిలీజ్ చేసి, నార్త్ లో ఎవరితో అయినా టైఅప్ అవ్వాలి అనేది మేకర్స్ ఆలోచన. ఇప్పుడు RC 15 సంక్రాంతి బరిలోకి వస్తే బాక్సాఫీస్ దగ్గర పుష్పరాజ్ vs రామ్ చరణ్ వార్ జరగాల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్ vs దిల్ రాజు వార్ మరోసారి జరగాల్సిందే. ఈ సంక్రాంతికి అంటే మెగా నందమూరి సినిమాలు కాబట్టి ఒకేసారి రిలీజ్ అయ్యాయి కానీ ఒకే ఫ్యామిలీ నుంచి రెండు పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి అంటే కలెక్షన్స్ లో హ్యుజ్ డ్రాప్ కనిపించే ఛాన్స్ ఉంది. ఓపెనింగ్ కూడా ఏ సినిమాని ఎక్కువ వస్తాయి అనేది చెప్పలేని పరిస్థితి. పుష్ప సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యింది కాబట్టి పుష్ప ది రూల్ సినిమాకే కాస్త ఎక్కువ ఎడ్జ్ ఉండే ఛాన్స్ ఉంది. మరి ఈ క్లాష్ ని అవాయిడ్ చేసి పుష్ప ది రూల్, RC 15 సినిమాలు రిలీజ్ అవుతాయా? లేక తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్ బరిలో నిలుస్తాయా అనేది చూడాలి.