న్నడిగుల ఆరాధ్య దైవం రాజ్ కుమార్ మూడో తనయుడు పునీత్ రాజ్ కుమార్ కొద్ది సేపటి క్రితం గుండె పోటుతో కన్నుమూశాడు. పునీత్ ఇకలేరన్న విషయం తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.
కాగా పునీత్ మృతి పట్ల టాలీవుడ్ అగ్రహీరోలు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్‌బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ మరణం అత్యంత బాధాకరమని, ఈ వార్త విన్న వెంటనే తీవ్ర వేదనతో తన హృదయం ముక్కలైందని చిరంజీవి తెలిపారు. పునీత్ తనకు అత్యంత ఆప్తుడని, వారి కుటుంబంలోని వారంతా తనకు కావాల్సిన వారు అని.. ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా తనను పునీత్ చాలా ఆప్యాయంగా పలకరిస్తారని.. పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణ వార్త తెలియగానే తన నోట మాట కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పునీత్ రాజ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. పునీత్ మరణం కన్నడ చిత్ర పరిశ్రమకే కాకుండా యావత్ భారత చిత్ర రంగానికి పెద్దలోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. పునీత్ బంధువులు, అభిమానులకు ధైర్యం చేకూరాలని ఆశించారు.
Read Also: కన్నడ పవర్‌స్టార్ గొప్పతనం ఇదే… కళ్లను దానం చేసిన పునీత్
మరోవైపు పునీత్ రాజ్ కుమార్ ఇక లేరన్న విషయం విని తాను షాక్‌కు గురయ్యానని సూపర్ స్టార్ మహేష్‌బాబు తెలిపాడు. పునీత్ లేడన్న విషయం తలుచుకుంటే తీవ్ర విచారం కలుగుతోందన్నారు. తాను ఇప్పటివరకు కలిసి, మాట్లాడిన వారిలో అత్యంత వినమ్రుడైన వ్యక్తి పునీత్ రాజ్‌కుమార్ అని మహేష్ వివరించాడు. పునీత్ కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు సంతాపం తెలుపుతున్నట్లు మహేష్ ట్వీట్ చేశాడు. కాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు సహా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పునీత్ మరణం పట్ల సంతాపం తెలుపుతున్నారు.