ఎన్నో అంచనాలు పెట్టుకున్నా ‘ఘని’ మూవీతో మెగా అభిమానులని వరుణ్ తేజ్ బాగా డిజప్పాయింట్ చేశాడు. F3 కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. దీంతో మెగా ప్రిన్స్ ఈసారి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఒక స్టైలిష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. నాగబాబు సమర్పణలో ఎస్‌విసిసి బ్యానర్‌పై బాపినీడు, బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కి టైటిల్ ఇంకా ఫిక్స్ చెయ్యలేదు. VT 12 అనే వర్కింగ్ టైటిల్ తో వరుణ్ తేజ్ మూవీ ప్రస్తుతం సెట్స్ పైన ఉంది. ఈ చిత్రానికి ముఖేష్ కెమెరా, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, ఆర్ట్ విభాగాన్ని అవినాష్ కొల్లా చూసుకుంటారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని అనౌన్స్ చేస్తున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. జనవరి 19న VT 12 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని లాంచ్ చెయ్యనున్నారు. మరి ఈ మూవీతో వరుణ్ తేజ్ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. హీరో వరుణ్ తేజ్ కి మాత్రమే కాదు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుకి కూడా VT 12 హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. నాగార్జునతో ప్రవీణ్ సత్తారు చేసిన యాక్షన్ మూవీ ‘ది ఘోస్ట్’ హెవీ లాస్ ని ఫేస్ చేసింది. సో ప్రవీణ్ సత్తారుని హీరోలు, ప్రొడ్యూసర్ లు మళ్లీ నమ్మాలి అంటే అతను VT 12 హిట్ కొట్టాల్సిందే.
#VT12 pic.twitter.com/TFyloxOww9
— Varun Tej Konidela (@IAmVarunTej) January 17, 2023