మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ని మెగా ఫ్యాన్స్ అంతా ‘OG’ అంటూ ఉంటారు. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటూ రామ్ చరణ్ తేజ్ అంటూ సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఈ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ని గేమ్ ఛేంజర్ గా చూపిస్తూ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ సెట్స్ లో శంకర్ బర్త్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు. హైదరాబాద్ లో సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చెన్నైలో కోలీవుడ్ వర్గాల మధ్య పార్టీ జరిగింది. ఈ బర్త్ డే పార్టీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అంతా రావడం విశేషం. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ అటెండ్ అవ్వడంతో బర్త్ డే ఫొటోస్ మరింత స్పెషల్ గా మారాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో శంకర్, రామ్ చరణ్ తో పాటు లోకేష్ కనగరాజ్, హీరో విక్రమ్, గోపీచంద్ మలినేని, ఎస్జే సూర్య, విగ్నేష్ శివన్, కార్తీక్ సుబ్బరాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, వెట్రిమారన్, లింగుస్వామి ఉన్నారు. అందరిలోకి చరణ్-లోకేష్ ఉండడంతో ఈ కాంబినేషన్ లో సినిమా చేయండి అన్నా అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గ్యాంగ్స్ స్టర్స్ తో గేమ్ ఛేంజర్ అంటూ చరణ్ ఫ్యాన్స్ ఫోటోని వైరల్ చేస్తున్నారు. మొత్తం ఫోటోలో చరణ్-లోకేష్, చరణ్-వెట్రిమారన్, చరణ్-కార్తీక్ సుబ్బరాజ్ ల కాంబినేషన్ లో ఒక్కటి సెట్ అయినా కూడా పాన్ ఇండియా రేంజులో సంభవం జరుగడం గ్యారెంటీ. కార్తీక్ సుబ్బరాజ్ ఇచ్చిన కథతోనే గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కుతుండటం విశేషం. ఈ మూవీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి రానుంది.
Happy birthday the legendary dir @shankarshanmugh sir 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 have a great year sir 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏sjs pic.twitter.com/Ymy9QTRA3t
— S J Suryah (@iam_SJSuryah) August 17, 2023