RC 15: అలా షూటింగ్ మొదలయ్యింది… ఇక లీక్ ఇచ్చేశారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RC 15’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. చార్మినార్ దగ్గర చరణ్ పొలిటికల్ స్పీచ్ తో ఈరోజు షూటింగ్ స్టార్ట్ అయ్యింది. షూటింగ్ అలా స్టార్ట్ అయ్యిందో లేదో ఇలా లీక్ ఇచ్చేశారు మెగా అభిమానులు. చరణ్ ‘RC 15’ సినిమాలో ఏ పార్టీ పెట్టాడు, ఎలా కనిపించబోతున్నాడు లాంటి విషయాలని షూటింగ్ స్పాట్ నుంచి లీక్ చేసేశారు. దీంతో సోషల్ మీడియాలో RC 15 షూటింగ్ నుంచి అభిమానులు లీక్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చరణ్-శంకర్ లు పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టాలి అని కష్టపడి చేస్తున్న RC 15 షూటింగ్ స్పాట్ నుంచి ఫోటోస్ లీక్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు గతంలో వైజాగ్, రాజమండ్రి షెడ్యూల్స్ నుంచి కూడా ఇలానే ఫాన్స్ షూటింగ్ చూడడానికి వెళ్లి చరణ్ లుక్ ని లీక్ చేశారు. శంకర్ సినిమాలో సోషల్ ఎలిమెంట్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందుకే చరణ్, విలేజ్ లుక్ అండ్ కాలేజ్ స్టూడెంట్ లుక్… ఇలా రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు అనే మాట బయటకి వచ్చింది కానీ ఎలాంటి రోల్ చేస్తున్నాడు అనే పూర్తిగా ఎవరికీ తెలియదు. భారతీయుడు సినిమాలో ఓల్డ్ కమల్ హాసన్ క్యారెక్టర్ రేంజులో RC 15లో ఫాదర్ క్యారెక్టర్ ని డిజైన్ చేసే అవకాశం కూడా ఉంది.
ఈ విషయాన్ని మర్చిపోయిన మెగా అభిమానులు, చరణ్ విలేజ్ లుక్ లో కనిపించగానే ఫోటోస్ అండ్ వీడియోస్ తీసి ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు. దీని కారణంగా చరణ్ విలేజ్ లుక్ రివీల్ అయిపొయింది, రాజమండ్రి షెడ్యూల్ లో నుంచి అయితే చరణ్ తో పాటు పక్కన ఉన్న శ్రీకాంత్ లుక్ కూడా రివీల్ అయిపొయింది. ‘అభ్యుదయం పార్టీ’ పెట్టిన మీటింగ్ సీన్స్ ‘RC 15’లో ఇంపార్టెంట్ అయ్యి ఉంటే, థియేటర్ లో చూస్తే వచ్చే ఎగ్జైట్మెంట్ ని మెగా అభిమానులు తగ్గించినట్లే అవుతుంది. వేరే ఎవరైనా లీక్ చేస్తే ఆపాల్సిన ఫాన్స్, స్వయంగా ఇలా లీక్ చేయడం సినిమాకి నష్టం కలిగించే విషయమే. ఈ లీక్ అయిన ఫొటోస్ లో కనిపిస్తున్న ‘అభ్యుదయం పార్టీ’పైనే RC 15 సెకండ్ హాఫ్ ఆధారపడి ఉంటుంది. ఇది అర్ధం చేసుకోని ఇకపై అయినా మెగా అభిమానులు లీకులు తగ్గిస్తే బాగుంటుంది. ఇదిలా ఉంటే మార్చ్ 27న రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు సంధర్భంగా, మేకర్స్ మెగా అభిమానులకి మాత్రమే కాకుండా పాన్ ఇండియా సినీ అభిమానులందరికీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చే రేంజులో RC 15 ఫస్ట్ లుక్ ని రిలీజ్ చెయ్యబోతున్నారట. ఈ విషయంలో అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు కానీ అభిమానులే అనుకుంటున్నారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు