Site icon NTV Telugu

Allu Arjun: దురంధర్ 2ను లేపి.. పవన్ సినిమాని పట్టించుకోని బన్నీ

Allu Arjun

Allu Arjun

మెగా కాంపౌండ్ లో గత కొంతకాలంగా సాగుతున్న ‘సైలెంట్ వార్’ ఇప్పుడు మరోసారి రచ్చకెక్కింది, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి. తాజాగా బాక్సాఫీస్ వద్ద తలపడుతున్న చిత్రాల విషయంలో బన్నీ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతోంది, నిజానికి వీరిద్దరి మధ్య దూరం పెరగడానికి 2024 ఎన్నికలే ప్రధాన కారణమని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ అంతా ఏకతాటిపైకి వస్తే, అల్లు అర్జున్ మాత్రం పవన్ కి వ్యతిరేకంగా నిలబడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారానికి వెళ్లారు, నాడు బన్నీ తీసుకున్న ఆ నిర్ణయం పవన్ అభిమానుల మనసును తీవ్రంగా గాయపరిచింది. అప్పటి నుండి ‘మెగా’ వర్సెస్ ‘అల్లు’ అన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తూనే ఉంది.

Also Read:Chiranjeevi: వైఎస్ఎస్ సేవలను ప్రశంసిచిన మెగాస్టార్ చిరంజీవి

ప్రస్తుతం థియేటర్ల వద్ద ‘ధురందర్: ది రివెంజ్’ అలానే పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. ఇద్దరు స్టార్ల సినిమాలు పోటీ పడుతున్న తరుణంలో అల్లు అర్జున్ మాత్రం ‘ధురందర్’ సినిమాను చూసి, ఆ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. కానీ, అదే రోజు విడుదలైన తన సొంత మేనమామ పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి మాత్రం కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం ఆల్ ది బెస్ట్ కూడా చెప్పకపోవడం పవన్ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. “సొంత ఫ్యామిలీ హీరో సినిమాను పట్టించుకోకుండా, వేరే సినిమాను ప్రమోట్ చేయడం ఏంటి?” అంటూ పవన్ అభిమానులు బన్నీని టార్గెట్ చేస్తున్నారు. ఇది కేవలం యాదృచ్చికం కాదని, కావాలనే పవన్ సినిమాను విస్మరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

Exit mobile version