నాగబాబు కుమార్తె నిహారిక భర్త చైతన్యతో కలసి ప్రస్తుతం స్పెయిన్‌లో విహరిస్తోంది. తన హాలీడే ట్రిప్ కి సంబంధించి ప్రతి రోజూ అప్ డేట్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ వస్తోంది నీహారిక. స్పెయిన్ లోని అద్భుతమైన లొకేషన్స్, ప్రసిద్ధమైన కోస్టాస్ బీచ్‌తో పాటు రోమన్ శిధిలాలను సందర్శించిన నిహారిక ఆ ఇమేజెస్ ను షేర్ చేసింది. ఇక తను స్పెయిన్ లో స్కైడైవింగ్‌ను ఎలా పూర్తి చేసిందో వీడియో ద్వారా తెలియచేసింది.
తను స్కై డైవ్ చేసిన వీడియో షేర్ చేస్తూ ‘నేను చేసాను అబ్బాయిలు! చాలా పారవశ్యంగా ఫీలవుతున్నాను’ అని ట్వీట్ చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, సన్నిహితులతో పాటు అభిమానులు నిహారిక రేర్ ఫీట్ ను అభినందించారు. ఈ నెల 9న తమ వివాహ మొదటి వార్షికోత్సవం పురస్కరించుకుని విహారయాత్ర చేస్తోంది నిహారిక, చైతన్య జంట.
https://www.instagram.com/tv/CXGCKzgj_BZ/?utm_medium=share_sheet