Mega 154 First Look Teaser To Release On This Date: మెగాస్టార్ చిరంజీవి వరుసగా చేస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘మెగా154’ ఒకటి. అనౌన్స్మెంట్ నుంచే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే దర్శకుడు బాబీ ఇందులో ముఠామేస్త్రి నాటి వింటేజ్ చిరుని మళ్లీ చూస్తామని చెప్పాడో, అప్పట్నుంచి ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇక రీసెంట్గా మాస్ మహారాజా రవితేజ కూడా షూటింగ్లో జాయిన్ అవ్వడంతో, ఈ సినిమాకి మరింత ప్రత్యేకత వచ్చిపడింది.
అందుకే, ఈ సినిమా నుంచి టీజర్, ప్రోమోలు ఎప్పుడెప్పుడు వస్తాయా? అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం ఎంతో దూరంలో లేదు. ఎందుకంటే, త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ని విడుదల చేసేందుకు చిత్రబృందం సమాయత్తమవుతోందని సమాచారం. ఇండస్ట్రీ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుని పురస్కరించుకొని, ఆగస్టు 22వ తేదీన ‘మెగా154’ ఫస్ట్ లుక్ టీజర్‌ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట! అదే సమయంలో ఈ సినిమా టైటిల్‌ని కూడా అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. మెగా ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్సే!
కాగా.. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో రవితేజ పోలీస్ అధికారి పాత్ర పోషిస్తున్నాడని, ఈ సినిమా చిరు – రవితేజ మధ్య దొంగా పోలీస్ ఆట తరహాలో సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.