Meet Cute: అక్క స్క్రిప్ట్ ను నాని పక్కన పెట్టేశాడా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani: నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహించిన తొలి వెబ్ సిరీస్ ‘మీట్ క్యూట్’. ఈ ఐదు కథల ఆంథాలజీలో వర్ష బొల్లమ్మ, శ్రీదివ్య, సమీర్, అశ్విన్ కుమార్, సత్యరాజ్, రుహానీ శర్మ, రాజ్ చెంబోలు, రోహిణి మొల్లేటి, ఆకాంక్షా సింగ్, దీక్షిత్ శెట్టి, అలేఖ్య, హారిక, ఆదా శర్మ, శివ కందుకూరి, సునైన తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 25న సోని లివ్ లో ‘మీట్ క్యూట్’ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా దీప్తి గంటా మాట్లాడుతూ, ”నేను గతంలో ఒక షార్ట్ ఫిలిం చేశాను. ‘మీట్ క్యూట్’లో ఒక కథ రాసి నానికి వినిపిస్తే ‘ఇలాంటివి ఇంకో మూడు నాలుగు వ్రాయి కలిపి ఆంథాలజీ చేయొచ్చు’ అని సలహా ఇచ్చాడు. నాని అడిగినా కూడా ఏదైనా మంచి ఆలోచన ఇన్స్ పైర్ చేశాకే ఈ స్క్రిప్ట్ రాశాను. ప్రయాణాల్లో, ఇతర సందర్భాల్లో ఎవరైనా తెలియనివారితో పరిచయం చేసుకుని మాట్లాడటం నాకు అలవాటు. అలాంటి అపరిచిత వ్యక్తుల మధ్య సంభాషణ ఎలా ఉంటుంది? అనే ఊహతో ఈ స్క్రిప్ట్ మొదలుపెట్టాను. మన లైఫ్ లో ఎదురయ్యే ప్లెజంట్ మూమెంట్స్ తో పాటు వివిధ సందర్భాలను ఈ కథల్లో చూపించాను. అర్బన్ బేస్డ్ గా ఈ కథ సాగుతుంది. అయినా ప్రేక్షకులందరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది” అని అన్నారు.
నాని మాట్లాడుతూ, ”ఈ స్క్రిప్ట్ చాలా రోజులు చదవకుండా పక్కన పెట్టాను. చదివిన వారంతా బాగుంది అని చెప్పినా, అలాగే చెప్తారని అనుకున్నా. మా సిస్టర్ ప్రెజర్ చేసే సరికి చదవడం ప్రారంభించాను. కొద్ది పేజీలు చదివేసరికి ఈ కథలో లీనమయ్యాను. అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మీట్ క్యూట్ అనే స్క్రిప్ట్ మా సిస్టర్ కాకుండా మరెవరు రాసినా ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చేవాడిని. నాకు స్క్రిప్ట్ ఇచ్చేవారు ఫోన్ నెంబర్ రాసి వెళ్తారు. అలా రాయకున్నా వాళ్లెవరో వెతికి మరీ ఈ కథను తెరకెక్కించేవాళ్లం. ‘మీట్ క్యూట్’ లో క్యారెక్టర్స్, అవి మాట్లాడుకునే మాటలు, వాళ్ల మధ్య వచ్చే సందర్భాలు అన్నీ చాలా సహజంగా ఉంటాయి. ఈ కథ సినిమాకు ఉపయోగపడదు. ఎందుకంటే మనం సినిమాల్లో ఎంత నాచురల్ స్టోరీ తీసుకున్నా దానికి కొంత డ్రామా కలుపుతాం. ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటాం. కానీ ఇందులో ఆ పాత్రలు తర్వాత ఎలా ముందుకెళ్తాయి, ఎలా ముగుస్తాయి అనే ఆసక్తి కలుగుతుంటుంది. నాకు ఇందులో నటించే క్యారెక్టర్ లేదు. సిస్టర్ డైరెక్టర్ కాబట్టి నేను ఖచ్చితంగా అతిథి పాత్రలో నటిస్తానని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ కథలో అవకాశం లేకుండా నటిస్తే పేరుకు కనిపించినట్లు ఉంటుంది. రోహిణి, ఆకాంక్ష మధ్య వచ్చే సన్నివేశాలు నాకు బాగా నచ్చాయి. మంచి కంటెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు వాల్ పోస్టర్ సంస్థ ద్వారా నిర్మిస్తాం” అని అన్నారు.
Also Read
- Kannada Stars : యశ్ పాన్ - ఇండియా రేంజ్‌ని అందుకోలేకపోతున్న కన్నడ స్టార్ హీరోలు
- Awarapan 2: ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి.. బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్తున్న ‘అవరాపన్ 2’
- Dhanush Digital : ధనుష్ సోషల్ మీడియా IT వింగ్.. పొలిటికల్ ఎంట్రీ కోసమేనా?
- Saif-Kiara Movie: తొలిసారి జోడీ కడుతున్న సైఫ్, కియారా.. సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌కు రంగం సిద్ధం
తాజావార్తలు
-
TTD Hundi Income: శ్రీవారికి కాసుల వర్షం.. హుండీ ఆదాయం సరికొత్త రికార్డు.. మూడేళ్ల తర్వాత..!
-
India All-Time Test XI: భారత్ ఆల్‌టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్‌గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
Kannada Stars : యశ్ పాన్ – ఇండియా రేంజ్‌ని అందుకోలేకపోతున్న కన్నడ స్టార్ హీరోలు
-
Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!