Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మూవీ మన శంకర వర ప్రసాద్ గారు. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్లు వస్తున్నాయి. మొన్న మీసాల పిల్ల సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. అది బాగా వైరల్ అయింది. ప్రోమో చూసిన ఫ్యాన్స్ సూపర్ అంటూ ఫుల్ సాంగ్ గురించి అడగడం స్టార్ట్ చేశారు. అయితే తాజాగా ఈ ఫుల్ సాంగ్ అప్డేట్ ను కూడా ప్రమోషన్ మాదిరి ఇచ్చేశాడు అనిల్ రావిపూడి. చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు ఇందులోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్ అప్డేట్ ను అతని ద్వారా ఇప్పించారు. భీమ్స్ మీసాల సాంగ్ మ్యూజిక్ వాయిస్తుంటే అక్కడే పడుకున్న బుల్లిరాజు.. ఫుల్ సాంగ్ అప్డేట్ ఎప్పుడండి.. ఇక్కడ నన్ను దొబ్బుతున్నారు అంటూ ఫోన్ లో ఫ్యాన్స్ తో మాట్లాడుతాడు.
Read Also : SS Rajamouli : రాజమౌళికి జక్కన్న అనే బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా..?
అది నాకేం తెలుసు.. డైరెక్టర్ గారిని అడుగు అంటాడు భీమ్స్. దాంతో బుల్లిరాజు డైరెక్టర్ దగ్గరకు వెళ్లి ఫుల్ సాంగ్ అప్డేట్ ను అడుగుతాడు. మన చిరంజీవి గారి డ్యాన్స్ ప్రాక్టీస్ ను ను అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది కదా అంటాడు. దీంతో బుల్లిరాజు మెగాస్టార్ డ్యాన్స్ ప్రాక్టీస్ ను తన స్టైల్ లో వేస్తూ.. అక్టోబర్ 13న అంటే సోమవారం అని అప్డేట్ ఇస్తాడు. సోమవారం ఈ ఫుల్ సాంగ్ రాబోతోందన్నమాట. ట్యూన్స్ బాగుండటంతో విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఫుల్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతోంది. ఇందులో చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నారు.
Read Also : SS Rajamouli : ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ ను చూసి రాజమౌళి ఏం అనుకున్నాడో తెలుసా..?