Vaarahi: చిత్ర బృందం సమక్షంలో మీనాక్షి గోస్వామి బర్త్ డే వేడుకలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sumanth: వారాహి అమ్మవారిని ఏడు శక్తి రూపాల్లో ఒకరిగా కొలుస్తారు. ఏడుగురు దేవతా మాతృమూర్తుల్లో వారాహి కూడా ఒకరు. వరాహ స్వామి శక్తి నుండి ఉద్భవించిన వారాహి అమ్మ వారి ఆలయ నేపథ్యంలో సుమంత్ హీరోగా ‘వారాహి’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. వీరి కాంబినేషన్ లో గతంలో ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో సుమంత్, సంతోష్ జాగర్లపూడి కొత్త చిత్రం ‘వారాహి’పై కూడా అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
‘వారాహి’ చిత్రంలో నాయికగా రాజస్థానీ ముద్దుగుమ్మ మీనాక్షి గోస్వామి నటిస్తోంది. తాజాగా ఆమె పుట్టినరోజు సెలబ్రేషన్స్ ను ‘వారాహి’ చిత్ర బృందం జరిపింది. దర్శకుడు సంతోష్, హీరో సుమంత్, నిర్మాతలు ఆమెకు బర్త్ డే విసెస్ తెలిపారు. త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. సత్యసాయి శ్రీనివాస్, గెటప్ శ్రీను, కృష్ణ చైతన్య తదితరులు ప్రధాన పాత్రలు పోషించబోతున్న ఈ చిత్రానికి సంగీతం ఈశ్వర్ చంద్. ఈ సినిమాలోని ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Also Read
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
- Karuppu: ‘కరుపు’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. సూర్య ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ రెడీ!
- P. Bharat Bhushan: ఏపీ ఎఫ్డీసీ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్..
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం
-
Narendra Modi : సీఎం రేవంత్‌కు మోడీ కౌంటర్..
-
Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..
-
CM Revanth Reddy: గుజరాత్‌కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..