మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 5 స్పీడ్ పెరిగింది, ఇప్పటికే ఫెబ్ లో ‘యాంట్ మాన్ అండ్ ది వాస్ప్-క్వాంటుమేనియా’ సినిమాతో ఫేజ్ 5 స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ ఆశించిన రేంజులో ఆడలేదు కానీ మే 5న రిలీజ్ కానున్న ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3’ సినిమాపై మాత్రం భారి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో ఫేజ్ 5లో జోష్ వస్తుందని మార్వెల్ లవర్స్ నమ్ముతున్నారు. మే 5న ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3’ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆరు నెలల పాటు ఫేజ్ 5లో మరో సినిమా విడుదలకి రెడీగా లేదు. ఈ గ్యాప్ ని మర్చిపోయే రేంజులో నవంబర్ నెలలో 10న ‘ది మార్వెల్స్’ సినిమా రిలీజ్ కానుంది. యాక్షన్, ఫన్, అడ్వెంచర్ కలిసిన ఈ మూవీలో ‘కెప్టెన్ మార్వెల్’, ‘కమలా ఖాన్’, ‘మోనికా’ క్యారెక్టర్స్ కలిసి కనిపించానున్నాయి. ఈ ముగ్గురిని టీం అప్ చేసే క్యారెక్టర్ లో ‘నిక్ ఫ్యూరి’ పాత్రలో సామ్యూల్ జాక్సన్ నటిస్తున్నాడు.
అవెంజర్స్ అంటేనే టీం గేమ్, అలాంటిది మొదటిసారి ఉమెన్ పవర్ చూపిస్తూ ఈ సూపర్ హీరోస్ కలిసి నటించడంతో ‘ది మార్వెల్స్’ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ టీజర్ ట్రైలర్ ని మార్వెల్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ట్రైలర్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకూ ఫన్, యాటిట్యూడ్, ఫ్రెండ్షిప్, అడ్వెంచర్, గ్రాండ్ విజువల్స్ కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మార్వెల్ నుంచి వచ్చిన ఒక టీజర్ ట్రైలర్ ని ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఇదే మొదటిసారి. మరి ఈ మూవీతో ఫేజ్-5కి జోష్ వస్తుందేమో చూడాలి. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ MCUకి పూర్వ వైభవం తీసుకోని రాలేకపోతున్నాయి. ఏ సూపర్ హీరో సినిమా ఆ మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
Teaming up changes e̶v̶e̶r̶y̶t̶h̶i̶n̶g̶ everyone.
Marvel Studios’ #TheMarvels, only in theaters November 10. pic.twitter.com/M9oyQYt39B
— Marvel Studios (@MarvelStudios) April 11, 2023