కొందరు హీరోలు, హీరోయిన్స్ ఎన్నిసార్లు కలసి నటించినా మళ్లీ మళ్లీ జనం చూసేందుకు ఇష్టపడుతుంటారు. కానీ, అటువంటి బాక్సాఫీస్ సక్సెస్ ఫుల్ జోడీలుగా అప్పుడప్పుడూ దర్శకుడు, హీరోయిన్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీయెస్ట్ డైరెక్టర్, హీరోయిన్ కాంబినేషన్ అంటే… సంజయ్ లీలా బాన్సాలీ, దీపిక పదుకొణేదే!
‘రామ్ లీలా’ ఇంటెన్స్ లవ్ స్టోరీ, ‘బాజీరావ్ మస్తానీ’ పీరియాడికల్ రాయల్ రొమాన్స్, ‘పద్మావత్’ హిస్టారికల్ మైల్ స్టోన్! ఇలా బాన్సాలీ, దీపిక కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ సినిమా ఓ అద్భుతమే! పైగా దీపూని బాలీవుడ్ లో నంబర్ వన్ చేసింది ప్రధానంగా సంజయ్ సినిమాలే. అందుకే, ఈ డైరెక్టర్ అండ్ హీరోయిన్ కొలాబరేషన్ అంటే ఆడియన్స్ ఎక్కడ లేని ఆసక్తి చూపిస్తారు! ఇప్పుడు మరోసారి బాన్సాలీ అండ్ డీపీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వినే టైం వచ్చేసింది…
నెక్ట్స్ ‘బైజు బావ్రా’ సినిమా చేయబోతున్నాడు ‘గంగూభాయ్ కతియావాడి’ డైరెక్టర్ సంజయ్ బన్సాలీ. రూపమతి అనే ఓ బందిపోటు రాణి గురించిన కథే ‘బైజు బావ్రా’. ఇది అక్బర్ కాలం నాటి చారిత్రక కథ. అయితే, తన నెక్ట్స్ పీరియాడికల్ డ్రామాలో దీపికనే టైటిల్ రోల్ కోసం ఎంచుకున్నాడట సంజయ్. ఆయనతో ఇప్పటికే దీపిక పలుమార్లు చర్చలు జరిపిందంటున్నారు. స్క్రిప్ట్ నెరేషన్ కూడా అయిపోవటంతో సినిమా కోసం ఇన్వెస్టర్స్ ని వెదికే పనిలో ఉన్నారట. ‘బైజు బావ్రా’ సినిమా వచ్చే సంవత్సరం సెట్స్ మీదకి వెళ్లవచ్చట! చూడాలి… ఇప్పటికే మూడు హిట్స్ తో హ్యాట్రిక్ పూర్తి చేసిన సంజయ్ లీలా బాన్సాలీ, దీపికా పదుకొణే జోడీ నాలుగోసారి ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో…