ఒక హిట్.. ఒక ఫ్లాప్ అనేలా దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. క్రాక్‌తో మాస్ హిట్ కొట్టిన రవితేజ.. ఆ తర్వాత ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో ఫ్లాప్స్ అందుకున్నాడు. ఈ రెండు ఫ్లాప్స్ ఎంత డిజప్పాయింట్ చేసాయో అంతకు మించి అనేలా బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చాడు రవితేజ. రెండు సాలిడ్ హిట్స్ ఇచ్చి, నెవర్ బిఫోర్ కెరీర్ గ్రాఫ్ లో ఉన్నాడు అనుకోగానే మళ్లీ రావణాసురతో రవితేజ డిజాస్టర్ అందుకున్నాడు. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా, ఎన్ని హిట్స్ వచ్చినా రవితేజ మార్కెట్ మాత్రం ఎఫెక్ట్ అవ్వట్లేదు అందుకే ఈసారి బౌండరీలు దాటి నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో పాన్ ఇండియాకి గురి పెట్టడానికి రెడీ అవుతున్నాడు మాస్ రాజా. ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నాడు రవితేజ.
వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే భారీగా ఉన్నాయి. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా హిట్లను అందించిన అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నార్త్ లో వీళ్లకి ఉన్న క్రెడిబిలిటీ ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలవడం గ్యారెంటీ. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. టైగర్ నాగేశ్వరరావు టీజర్ రెడీ అయినట్టు సమాచారం. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ ప్రివ్యూని కొంతమందికి ప్రదర్శించగా ఇటు సౌత్, అటు నార్త్ సినీప్రముఖుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. సినిమా రషేస్ చూసిన వాళ్లు కూడా అవుట్ పుట్ అదిరిపోయిందనే కామెంట్స్ చెప్తున్నారట. అతి త్వరలోనే టీజర్ రిలీజ్ చేయబోతున్నారని సమాచరం. దీంతో టైగర్ టైం వచ్చేసినట్టేనని రవితేజ ఫాన్స్ జోష్ లోకి వస్తున్నారు. సినిమా సినిమాకు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వని రవితేజ.. ఈ ఏడాదిలో మరో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రేణు దేశాయ్ రీ ఎంట్రి ఇస్తుండగా.. నుపుర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జీవీ ప్రకాష్ మ్యూజిక్ టైగర్ నాగేశ్వరరావు సినిమాకి బ్యాక్ బోన్ లా నిలవనుంది.