Mass Director Comes In Prabhas Lineup: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలుసు. మరో ఐదారేళ్లు ఖాళీ లేనంత ప్రాజెక్టులు అతని చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే, మారుతి సినిమా చిత్రీకరణల్లో బిజీగా ఉన్నాడు. ఇవే కాకుండా.. పట్టాలెక్కని మరికొన్ని ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఒకదాని తర్వాత మరొక సినిమాల్ని పూర్తి చేసేలా ప్రభాస్ పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ఇంతటిలో ప్రభాస్ ఆగట్లేదు.. తన వద్దకు వచ్చే ప్రతీ కథను వింటున్నాడు. ఒకవేళ నచ్చితే, దాన్ని కూడా లైన్లో పెడుతున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా ప్రభాస్ ఓ మాస్ దర్శకుడికి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇంతకీ ఆ దర్శకుడు మరెవ్వరో కాదు.. ‘క్రాక్’, ‘వీరసింహారెడ్డి’ సినిమాలతో ఊరమాస్ దర్శకుడిగా అవతరించిన గోపీచంద్ మలినేని.
Thunivu: ఆత్మహత్య చేసుకున్న అజిత్ ఫ్యాన్.. అందుకు అనుమతి ఇవ్వలేదని..
అవును, స్వయంగా ఈ విషయాన్ని గోపీచంద్ మలినేనినే ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. వీరసింహారెడ్డితో హిట్ సాధించిన ఈ దర్శకుడు.. తన తదుపరి సినిమా కోసం పలువురు హీరోలతో చర్చిస్తున్నానని, ప్రభాస్‌తోనూ చర్చలు కొనసాగుతున్నాయని తెలిపాడు. అయితే.. ప్రభాస్‌తో ఇంకా ఫైనలైజ్ అవ్వలేదని కూడా చెప్పాడు. ఒకవేళ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ప్రాజెక్ట్ కే, స్పిరిట్, సిద్ధార్థ్ ఆనంద్‌ల తర్వాతే సినిమా ఉండొచ్చు. ఎందుకంటే.. వాళ్లకు ప్రభాస్ ఆల్రెడీ డేట్స్ కేటాయించేశాడు. పైగా.. లైనప్‌లో గోపీచంద్ ఆలస్యంగా వచ్చాడు కాబట్టి, మొదటి ప్రాధాన్యత ఆ ప్రాజెక్టులకే ఉంటుంది. ఈ లెక్కన.. గోపీచంద్‌కి ప్రభాస్ కోసం చాలా సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ గ్యాప్‌లో అతడు ఇతర హీరోలతో కనీసం రెండు సినిమాలు ఈజీగా చేసేయొచ్చు. అయితే.. ప్రభాస్, గోపీచంద్ కాంబోలో సినిమా ఉంటుందా? లేదా? అన్నది కాలమే సమాధానం చెప్పాలి.