Vishal: ‘మార్క్ ఆంటోని’ ఓ డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్ ఇస్తుంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటు టాలీవుడ్.. అటు కోలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన సుస్థిర స్థానం దక్కించుకున్న హీరో విశాల్. ఆయన పుట్టినరోజు మంగళవారం (ఆగస్ట్ 29). ఈ సందర్బంగా ఆయన త్వరలోనే ‘మార్క్ ఆంటోని’ అనే చిత్రంతో సందడి చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన రాబోతున్న తన కొత్త సినిమా గురించిన సంగతులను ప్రత్యేకంగా వివరించారు. ”ఈ బర్త్ డే నాకెంతో స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే రానున్న సెప్టెంబర్ 15న ‘మార్క్ ఆంటోని’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఇప్పటి వరకు నేనేన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాల్లో నటించాను. ఆడియెన్స్ నన్ను ఎప్పటికీ ఆదరిస్తూనే వచ్చారు. వారు అందించిన ఆదరాభిమానాలతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. నాపై ఇంత ఆదరాభిమానాలు చూపిస్తున్న ప్రేకకులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.
‘మార్క్ ఆంటోని’ విషయానికి వస్తే నా కెరీర్లో ఇదెంతో ముఖ్యమైన సినిమా. పీరియాడిక్ మూవీ. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ ఓ ఎత్తు అయితే ఇదొక ఎత్తు. ఇందులో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాను. ఆ రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ కి కూడా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఓ కీలకమైన పాత్రలో ఎస్.జె.సూర్యగారు నటించారు. జి.వి.ప్రకాష్ గారు సంగీతాన్ని అందిస్తున్నారు. జి.వి. మ్యూజిక్ తో పాటు అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ.. పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్ ఫైట్స్ హైలైట్. థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులు ఎలాంటి సినిమాను చూడాలనుకుంటున్నారో అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ సినిమాలో ఉంటాయి. తప్పకుండా ఆడియెన్స్ కి ఓ డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్ ను మార్క్ ఆంటోని మూవీ ఇస్తుంది. మీ ప్రేమ, అభిమానాలుంటే ఇలాంటి సినిమాలను ఇంకా మరెన్నింటినో చేసి మిమ్మల్ని మరింతగా అలరిస్తానని చెబుతున్నాను” అన్నాడు విశాల్.
Also Read
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
తాజావార్తలు
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!