Manju Warrier: సినిమా .. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎన్నిరోజులు గ్లామర్ గా ఉంటారో.. అన్ని రోజులు మాత్రమే స్టార్స్ గా ఉండగలరు. ఆ గ్లామర్ ను కాపాడుకోలేని వారు.. సైడ్ క్యారెక్టర్స్ కు సెటిల్ అయిపోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ గ్లామర్ విషయంలో ఎంతో పట్టింపు ఉంటుంది. బుగ్గలు రాకూడదు, పొట్టరాకూడదు, ఫిట్ గా ఉండాలి, ముఖంలో కళ ఉండాలి. వయస్సు మీద పడినట్లు అస్సలు కనిపించకూడదు. దానికోసం, వాళ్లు పడే పాట్లు అంతాఇంతా కాదు. అయితే అది ఒక ఏజ్ వరకు వచ్చేవరకు మాత్రమే. వయస్సు పెరిగేకొద్దీ అందం తరుగుతూ ఉంటుంది. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే బ్యూటీకి మాత్రం వయస్సు పెరుగుతున్న కొద్దీ అందం పెరుగుతుంది. ఆమె మళయాళ నటి మంజు వారియర్. ఆమె వయస్సు 44. కానీ, ఆమెను చూసిన వారెవ్వరు.. ఆమె వయస్సు 44 అంటే అస్సలు నమ్మరు. సడెన్ గా ఆమె వయస్సు చెప్పమంటే.. 30 లోపే ఉంటాయని చెప్పుకొస్తారు. అంత అందంగా కనిపిస్తుంది. దానికోసం ఆమె ఎంత కష్టపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
NTR: అబ్బబ్బ.. ఎంత ముద్దుగా ఉన్నాడు సార్.. దిష్టి తగేలేనేమో
ఇక ఇప్పటికీ మంజు..స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మధ్యనే తెగింపు సినిమాలో అజిత్ సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న మంజుకు పెళ్లీడుకొచ్చిన కూతురు కూడా ఉంది అంటే నమ్ముతారా..?. ఇక తాజాగా మంజు తన సోషల్ మీడియాలో రెండు ఫోటోలను షేర్ చేసింది. ఫోన్ మాట్లాడుతూ ఒకటి, చిరునవ్వులు చిందిస్తూ ఇంకొకటి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింటి వైరల్ గా మారాయి. కుర్ర హీరోయిన్లే కుళ్ళుకోనేలా ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ ఫోటోలు చూసిన తెలుగు అభిమానులు ఈమె లేడీ మహేష్ బాబులా ఉందే. వీరు అసలు అన్నం తింటున్నారా..? అందం తింటున్నారా..? అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.