మూవీ మేకింగ్ మాస్టర్ గా భారతీయ సినీ అభిమానుల చేత కీర్తించబడుతున్న మణిరత్నం డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 1’. ఈ మూవీకి సీక్వెల్ గా ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దాదాపు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీపై కోలీవుడ్ సినీ అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది. బాహుబలి సినిమా రిలీజ్ అయిన ఏప్రిల్ 28నే సౌత్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియన్ సినిమాగా PS-2 పేరు తెచ్చుకుంది. లార్జ్ సెక్టార్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి అంటే సినిమాలో ఎంత గ్రాండియర్ ఉందో అందరికీ తెలియాలి. అప్పుడే ఈ సినిమాలో తమిళ నేటివిటీ ఉంది అనే విషయం మర్చిపోయి, మణిరత్నం చూపించే విజువల్స్ పైన దృష్టి పెడతారు. ఈ విషయాన్ని అర్ధం చేసుకున్న మేకర్స్, PS-2ని IMAX ఫార్మాట్ లో కూడా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
‘PS-1’ 2022లో రిలీజ్ అయ్యి 500 కోట్లు రాబట్టింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ తమిళ వాళ్లు ఉన్న ప్రతి చోటా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇతర రాష్ట్రాలలో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేక పోయింది. ప్రమోషన్స్ వీక్ గా చెయ్యడంతో ఇతర భాషల సినీ అభిమానులకి పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 పెద్దగా రీచ్ కాలేదు. పైగా సినిమాలో తమిళ ఫ్లేవర్ ఎక్కువగా ఉందంటూ కామెంట్స్ కూడా వినిపించడంతో, ఇది తమిళ వాళ్ల కోసం మాత్రమే తీసిన సినిమానేమో అనుకున్నారు. నిజానికి పొన్నియిన్ సెల్వన్ సినిమా తమిళ రాజుల కథ, అందుకే సినిమాలో తమిళ నేటివిటి ఉంటుంది. రీచ్ పెరగడం కోసం మణిరత్నం ఒరిజినల్ కథలో మార్పులు చేస్తే అది చరిత్రకే ద్రోహం చేసినట్లు అవుతుంది. ఈ విషయాన్ని చాలా మంది సినీ అభిమానులు అర్ధం చేసుకోలేకపోయారు అనేది వాస్తవం.
Immerse yourself into the world of #PS once again in the grandeur of @IMAX! 🤩
Come live this epic experience in IMAX THEATRES worldwide from April 28 🔥#PS2 #PonniyinSelvan #CholasAreBack #ManiRatnam @arrahman @LycaProductions @Tipsofficial @tipsmusicsouth @primevideoIN pic.twitter.com/Mr0DzDJQz5
— Madras Talkies (@MadrasTalkies_) January 31, 2023