ప్రస్తుతం బాలీవుడ్ కన్నంతా సౌత్ సినిమాలపై ఉంది అన్న మాట వాస్తవం. సౌత్ సినిమాలు అయినా ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్లు రాబట్టి శభాష్ అనిపించాయి. ఇక దీంతో బాలీవుడ్ లో కొందరు సౌత్ ఇండస్ట్రీపై నోరు పారేసుకోవడం.. వారికి కౌంటర్లు సౌత్ యాక్టర్లు ఇన్ డెరెక్ట్ గా పంచ్ లు వేయడం జరుగుతూనే ఉంది. ఇక ఇది అంతా ఒక ఎత్తు అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ పై లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న మణిరత్నం మాట్లాడుతూ.. ” హాలీవుడ్ సినిమాలు తమిళ్ లో హిట్ అయ్యినప్పుడు.. కన్నడ..తెలుగు సినిమాలు మన దగ్గర విజయం సాధిస్తే తప్పేముంది?.. ప్రస్తుతం సౌత్ సినిమా తమ పరిధులను పెంచుకొంటుంది. ఇప్పుడు వేరే భాషల సినిమాలను చూసి భయపడాల్సిన అవసరం లేదు. తమిళ పరిశ్రమ ఎప్పుడూ ఇతర పరిశ్రమలకి పోటీగాఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి రంగాల్లోనూ పోటీ ఉండాలి.. అది ఆరోగ్యంగా ఉండాలి. కొత్త మేకర్స్ వండర్స్ సృష్టిస్తున్నారు. వారిని ప్రోత్సహించాలి. తెలుగు..కన్నడ భాషల విజయాల్ని ఎవరూ ఆపలేరు. ఇంకా ముందు ముందు కొత్తవాళ్లు వస్తారు.. మరిన్ని వండర్స్ సృష్టిస్తారు.. కొత్త కొత్త విషయాలను ప్రజలకు నేర్పిస్తారు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే మణిరత్నం మాటలు కోలీవుడ్ లో చాలామందికి మింగుడు పడినట్లు లేదు అన్నది నమ్మదగ్గ నిజం. తెలుగు..కన్నడ సినిమాల్ని తమిళులు చిన్న చూపు చూస్తారు అనేది తెల్సిందే. అలాంటి వారికీ మణిరత్నం మాటలు గట్టిగా తగిలి ఉంటాయని పలువురు విశ్లేషిస్తున్నారు.