Mani Ratnam: సెట్స్‌పైకి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. ఒకే ఫ్రేమ్‌లో సాయి పల్లవి-విజయ్ సేతుపతి!

Maniratnam

Maniratnam

Mani Ratnam: దిగ్గజ దర్శకుడు మణిరత్నం మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను తెరకెక్కించే పనిలో పడ్డారు. ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కోల్‌కతాలో జరుగుతోందట. తాజాగా హీరో విజయ్ సేతుపతి కూడా షూటింగ్‌లో పాల్గొన్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కోల్‌కతా షెడ్యూల్ దాదాపు రెండు వారాల పాటు కొనసాగనుందని, అనంతరం షూటింగ్‌ను పుదుచ్చేరికి మార్చనున్నట్లు తెలుస్తోంది. స్టోరీకి అనుగుణంగా విభిన్న లొకేషన్లలో షూటింగ్ చేపట్టేందుకు మణిరత్నం ప్రత్యేక ప్లాన్స్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌కు మరో హైలెట్‌గా మ్యూజిక్ నిలవనుందని చెబుతున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారని సమాచారం. మణిరత్నం – ఏ.ఆర్.రెహమాన్ కాంబినేషన్ గతంలో ఎన్నో సంగీత సంచనాలను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త మూవీ కోసం మళ్లీ ఈ ఇద్దరూ కలిసి పని చేయబోతుండటంతో ఈ సినిమాపై మ్యూజిక్ లవర్స్‌లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్, రిలీజ్ తేదీలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.