Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srikanth Odela: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. ఇదే టైంలో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కథలో కుక్క దేవుడికి దండం పెట్టడం, హీరోను కాపాడే క్రమంలో చూపించిన దృశ్యాలపై నెటిజన్లు లాజిక్కులు వెతుకుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ట్రోలింగ్‌పై తాజాగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఘాటుగా, సూటిగా స్పందిస్తూ ఎస్.ఎస్.రాజమౌళి ‘మగధీర’ సినిమాను ఉదాహరణగా ప్రస్తావించారు.
సినిమాల్లో లాజిక్కుల కంటే ఎమోషన్ ప్రధానమని స్పష్టం చేస్తూ శ్రీకాంత్ ఓదెల చేసి ఆసక్తికర కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రాజమౌళి సార్‌తో నన్ను నేను పోల్చుకోవట్లేదు గానీ.. ‘మగధీర’ సినిమాలో ‘ధీర బాద్షా’ అన్నప్పుడు గుర్రం గాల్లోకి ఎగిరి కాలితో తాడును విసిరేస్తుంది. ఆ సీన్ చూసి థియేటర్లలో మనమంతా పిచ్చెక్కిపోయి విజిల్స్ వేశాం. అక్కడ లేవని లాజిక్.. నా ప్యారడైజ్ సినిమాలో కుక్క ఎమోషన్‌ను చూపించినప్పుడు ఎందుకు గుర్తొస్తోంది? ప్రతిదానికీ అతిగా లాజిక్కులు వెతికితే ఏ సినిమానూ ఎంజాయ్ చేయలేం. అది సినిమాటిక్ లిబర్టీ” అని శ్రీకాంత్ కుండబద్దలు కొట్టారు. ఇక ఆ కుక్క పాత్ర వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని వివరిస్తూ.. చిన్నప్పుడు హీరోను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినప్పుడు ఆ కుక్క జీప్ వెనకాలే పరిగెడుతుందని, జైలు గోడకు అటువైపు హీరో ఉంటే ఇటువైపు కుక్క ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ పెరుగుతుందని తెలిపారు. యజమాని ఎప్పుడు దండం పెట్టినా పక్కన నిలబడి చూసి నేర్చుకోవడం వల్లే ఆ ఎమోషన్ వచ్చిందని చెప్పారు. అయితే స్క్రీన్ మీద ఆ బ్యాక్‌స్టోరీని ప్రేక్షకులకు కన్వే చేయడంలో ఎక్కడో ట్రాన్స్లేషన్ మిస్సై ఉండొచ్చని, కానీ ఆ ఆలోచనలో ఎలాంటి తప్పు లేదని శ్రీకాంత్ వివరించారు. ఎమోషన్‌ను చూడకుండా కేవలం తప్పులు పట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న వారికి డైరెక్టర్ ఇచ్చిన ఈ రిప్లై నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Also Read
- ‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
- ‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
- SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
- Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
తాజావార్తలు
-
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
-
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
-
Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?